మధ్యప్రదేశ్‌లో స్పిన్‌ట్రానిక్స్ ఏఐ
ABN , Publish Date - Oct 29 , 2026 | 05:08 AM
హైదరాబాద్‌కు చెందిన స్పిన్‌ట్రానిక్స్ ఏఐ సెమీకండక్టర్స్.. మధ్యప్రదేశ్‌లో గాలియం నైట్రైడ్ (జీఏఎన్) సెమీకండక్టర్...
సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన స్పిన్‌ట్రానిక్స్ ఏఐ సెమీకండక్టర్స్.. మధ్యప్రదేశ్‌లో గాలియం నైట్రైడ్ (జీఏఎన్) సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఉజ్జయినీలో దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న ఈ ప్లాంట్‌కు సంబంధించి మధ్యప్రదేశ్ ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌ఓఐ)ను జారీ చేసింది. ఈ సెమీకండక్టర్ ప్లాంట్ కోసం కంపెనీ దాదాపు రూ.2,800 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనుంది. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా 1,000 మంది వరకు, పరోక్షంగా దాదాపు 2,800 మంది వరకు ఉపాధి అవకాశాలను కల్పించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి...
కాకినాడ సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక
Read Latest AP News And Telugu News