సీఈఈఆర్‌ఐతో స్పిన్‌ట్రానిక్స్ ఏఐ జట్టు
ABN , Publish Date - Oct 02 , 2026 | 05:33 AM
హైదరాబాద్‌కు చెందిన స్పిన్‌ట్రానిక్స్ ఏఐ సెమీకండక్టర్స్.. సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఈఆర్‌ఐ)తో...
దేశీయంగా జీఏఎన్ టెక్నాలజీ అభివృద్ధి
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌కు చెందిన స్పిన్‌ట్రానిక్స్ ఏఐ సెమీకండక్టర్స్.. సీఎస్‌ఐఆర్- సెంట్రల్ ఎలకా్ట్రనిక్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఈఈఆర్‌ఐ)తో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇరు సంస్థలు.. గాలియం నైట్రేడ్ (జీఏఎన్) టెక్నాలజీపై వ్యూహాత్మకంగా దృష్టి పెట్టడంతో పాటు డిజైన్ ట్రాన్స్‌ఫర్ భాగస్వామ్యాలపై దృష్టిని కేంద్రీకరించనున్నాయి. అంతేకాకుండా దేశీయంగా జీఏఎన్ టెక్నాలజీ అభివృద్ధి, ఫ్యాబ్రికేషన్ కేంద్రం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నాయి. రక్షణ, ఏరోస్పేస్, స్పేస్ సిస్టమ్స్, శాటిలైట్ కమ్యూనికేషన్స్, పవర్ ఎలకా్ట్రనిక్స్ సహా ఇతర హై ఫ్రీక్వెన్సీల్లో ఈ క్రిటికల్ నెక్ట్స్ జెనరేషన్ సెమీకండక్టర్ టెక్నాలజీ జీఏఎన్‌ను ఉపయోగిస్తారని స్పిన్‌ట్రానిక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ రఘు వర్మ తెలిపారు.
ఇవీ చదవండి:
స్కూల్ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్
నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!