Share News

ట్రావెల్‌ హంగామా సేల్‌

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:20 AM

ప్రముఖ ట్రావెల్‌ బ్రాండ్లలో ఒకటైన సదరన్‌ ట్రావెల్స్‌.. ‘‘ట్రావెల్‌ హంగామా సేల్‌ 2026’’ను ప్రారంభించింది. ఈ సంవత్సరాంతపు సెలవులు, వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో...

ట్రావెల్‌ హంగామా సేల్‌

  • ప్రారంభించిన సదరన్‌ ట్రావెల్స్‌

  • టూర్‌ ప్యాకేజీలపై ఆకర్షణీయ డిస్కౌంట్లు, ఆఫర్లు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రముఖ ట్రావెల్‌ బ్రాండ్లలో ఒకటైన సదరన్‌ ట్రావెల్స్‌.. ‘‘ట్రావెల్‌ హంగామా సేల్‌ 2026’’ను ప్రారంభించింది. ఈ సంవత్సరాంతపు సెలవులు, వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో, నచ్చిన సమయంలో పర్యటనల కోసం ప్రయాణికులు ముందుగానే బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. దేశ, విదేశీ టూర్‌ ప్యాకేజీలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, ప్రత్యేక డీల్స్‌, ప్రయోజనాలు వంటి వాటిని అందిస్తున్నట్టు బుధవారంనాడిక్కడ సదరన్‌ ట్రావెల్స్‌ జాయింట్‌ ఎండీ ప్రవీణ్‌ కుమార్‌ ఆలపాటి, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌(సేల్స్‌) శ్రీనివాస రావు, డైరెక్టర్‌ రామారావు తెలిపారు. రూ.5వేలు అడ్వాన్స్‌ చెల్లించి దేశీయ టూర్‌ను, రూ.10వేలు చెల్లించి ఇంటర్నేషనల్‌ టూర్‌ను బుక్‌ చేసుకోవచ్చని చెప్పారు. ప్రయాణికుల కోసం ‘ట్రావెల్‌ నౌ, పే లేటర్‌’ సదుపాయాన్ని కల్పిస్తున్నామని, దీని ద్వారా ప్రయాణికులు వడ్డీ లేని ఈఎంఐలలో చెల్లింపులు చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక గమ్యస్థానాలకు 2,500కు పైగా కస్టమైజ్డ్‌, గ్రూప్‌ హాలీడే ప్యాకేజీలు అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. 30 రోజుల పాటు ఈ సేల్‌ అందుబాటులో ఉంటుందన్నారు. టూర్స్‌పై రూ.60వేల వరకు డిస్కౌంట్‌ అందిస్తున్నామని అన్నారు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా

ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్

Updated Date - Nov 26 , 2026 | 04:23 AM