Share News

హైదరాబాద్‌లో సోలూజెనిక్స్‌ విస్తరణ

ABN , Publish Date - Jul 25 , 2026 | 01:55 AM

గ్లోబల్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ సోలుజెనిక్స్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది...

హైదరాబాద్‌లో సోలూజెనిక్స్‌ విస్తరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గ్లోబల్‌ టెక్నాలజీ సర్వీసెస్‌ సంస్థ సోలుజెనిక్స్‌.. హైదరాబాద్‌లో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించింది. ఇందులో భాగంగా పంజాగుట్టలో 500 సీట్లతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇంజనీరింగ్‌, కృత్రిమ మేధ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌, కన్సల్టింగ్‌, మేనేజ్డ్‌ సర్వీసె్‌సలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఈ సెంటర్‌ దోహదపడనుందని పేర్కొంది. కాగా సంస్థ ఇప్పటికే 500 మంది ఉద్యోగులతో మాదాపూర్‌లో సెంటర్‌ను నిర్వహిస్తోంది. భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా కొత్త సెంటర్‌ కోసం ఉద్యోగులను నియమించుకోనున్నట్లు తెలిపింది.

ఈ వార్తలు కూడా చదవండి:

క్వాంటం వ్యాలీలో మరో కీలక ప్రాజెక్టు

‘వందనం’తో తల్లికి ఆనందం

Updated Date - Jul 25 , 2026 | 01:55 AM