Share News

సోలార్‌ షేర్లకు షాక్‌

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:07 AM

బారత సోలార్‌ కంపెనీల మాడ్యూల్స్‌, సెల్స్‌పై అమెరికా 126ు సుంకాలు విధించడం బుధవారం మార్కెట్‌ను కుంగదీసింది. ఉదయం నుంచి ఉత్సాహంగా ట్రేడవుతున్న మార్కెట్‌పై ఈ వార్త పిడుగుపాటయింది....

సోలార్‌ షేర్లకు షాక్‌

ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్‌

ముంబై: బారత సోలార్‌ కంపెనీల మాడ్యూల్స్‌, సెల్స్‌పై అమెరికా 126ు సుంకాలు విధించడం బుధవారం మార్కెట్‌ను కుంగదీసింది. ఉదయం నుంచి ఉత్సాహంగా ట్రేడవుతున్న మార్కెట్‌పై ఈ వార్త పిడుగుపాటయింది. సెంటిమెంట్‌ దెబ్బ తిని అమ్మకాలు పోటెత్తడంతో ప్రారంభ లాభాలన్నీ తుడిచిపెట్టుపోయాయి. సెన్సెక్స్‌ 50.15 పాయింట్ల లాభంతో 82,276.07 వద్ద ముగియగా నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25,482.5 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ డే హై నుంచి దాదాపు 674 పాయింట్లు నష్టపోయింది. సోలార్‌ కంపెనీల షేర్లు బుధవారం ఐదు నుంచి 14 శాతం వరకు నష్టపోయాయి.

ఎల్‌ఐసీ, ఎంఎఫ్ లకు ఏఐ సెగ: ఏఐ ప్రభావంతో ఐటీ కంపెనీల షేర్లు పతనం కావడం ఎల్‌ఐసీ, మ్యూచువల్‌ ఫండ్స్‌ని కూడా భయపెడుతోంది. నిఫ్టీ ఐటీ సూచీ ఈ నెల ఇప్పటి వరకు గత 23 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా 21ు నష్టపోయింది. దీంతో ఈ సూచీలోని ఐటీ కంపెనీల షేర్లలో మదుపు చేసిన ఎల్‌ఐసి రూ.38,000 కోట్లు, ఎంఎ్‌ఫలు రూ.63,000 కోట్లు నష్టపోయాయి. నిఫ్టీ ఐటీ సూచీలోని 10 ఐటీ కంపెనీల షేర్లు ఈ నెల ఇప్పటి వరకు 17 నుంచి 27 శాతం వరకు నష్టపోయాయి.

ఆంత్రోపిక్‌ ముందు వెలవెల : తన సరికొత్త ఏఐ టూల్స్‌తో ఐటీ కంపెనీలను భయపెడుతున్న ఆంత్రోపిక్‌ కంపెనీ షేర్ల మార్కెట్‌ విలువ (మార్కెట్‌ క్యాప్‌) ముందు భారత ఐటీ దిగ్గజాలు వెలవెల పోతున్నాయి. ప్రస్తుతం ఆంత్రోపిక్‌ మార్కెట్‌ క్యాప్‌ 38,000 కోట్ల డాలర్ల (సుమారు రూ.34.39 లక్షల కోట్లు) వరకు ఉంది. గత 15 రోజులుగా జరుగుతున్న కరెక్షన్‌తో భారత ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, టెక్‌ మహీంద్ర కంపెనీల షేర్లు 17 నుంచి 27 శాతం వరకు నష్టపోయాయి. ప్రస్తుతం ఈ ఐదు దేశీయ ఐటీ దిగ్గజాల మార్కెట్‌ క్యాప్‌ 24,100 కోట్ల డాలర్లు (సుమారు రూ.21.99 లక్షల కోట్లు) మాత్రమే ఉంది.

ఇవి కూడా చదవండి:

మ్యాచ్ మధ్యలో పక్షికి సీపీఆర్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్

టీ20 ప్రపంచ కప్: న్యూజిలాండ్ మెరుపులు.. శ్రీలంక టార్గెట్ 169

Updated Date - Feb 26 , 2026 | 06:07 AM