Share News

చిన్న ఎగుమతిదారులకు ఊరట

ABN , Publish Date - Sep 17 , 2026 | 05:03 AM

చిన్న, కొత్త ఎగుమతిదారులపై నిబంధనల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది...

చిన్న ఎగుమతిదారులకు ఊరట

రూ.3 లక్షలలోపు ఎగుమతులకు

రిజిస్ట్రేషన్‌ నుంచి మినహాయింపు

న్యూఢిల్లీ: చిన్న, కొత్త ఎగుమతిదారులపై నిబంధనల భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రూ.3 లక్షల వరకు ఎగుమతి సరుకులకు రిజిస్ట్రేషన్‌-కమ్‌-మెంబర్‌షి్‌ప సర్టిఫికేట్‌ (ఆర్‌సీఎంసీ) పొందాల్సిన అవసరం లేదని వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు విదేశీ వాణిజ్య విధానం- 2023లో డీజీఎ్‌ఫటీ తగిన సవరణలు చేసినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. తద్వారా ఎంఎ్‌సఎంఈలు, చేతివృత్తుల వారు, చిన్న వ్యాపారాలు, తొలిసారి ఎగుమతులు చేసే వారికి అంతర్జాతీయ మార్కెట్లోకి ప్రవేశం సులభమవుతుందని, అలాగే పోస్టల్‌, కొరియర్‌, ఈ-కామర్స్‌ వంటి చానళ్ల ద్వారా జరిగే ఎగుమతులకు మరింత ఊతమిస్తుందని పేర్కొంది.

Also Read:

భారత సినీ రంగానికి అనంత్ నాగ్‌ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్

రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు

Updated Date - Sep 17 , 2026 | 05:03 AM