Share News

చిన్న నగరాల్లో కార్ల విక్రయాల జోరు

ABN , Publish Date - Nov 11 , 2026 | 05:32 AM

ఈ ఏడాది దేశీయ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) మార్కెట్‌ విస్తరణలో చిన్న నగరాలు, పట్టణాలే ప్రధాన పాత్ర పోషించాయి

చిన్న నగరాల్లో కార్ల విక్రయాల జోరు
cars

  • గత 10 నెలల్లో నమోదైన అదనపు విక్రయాల్లో

  • మెట్రోయేతర పట్టణ ప్రాంతాలదే 55శాతం వాటా

  • జాటో డైనమిక్స్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ఈ ఏడాది దేశీయ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) మార్కెట్‌ విస్తరణలో చిన్న నగరాలు, పట్టణాలే ప్రధాన పాత్ర పోషించాయి. ఈ అక్టోబరుతో ముగిసిన 10 నెలల్లో నమోదైన పీవీల అదనపు విక్రయాల్లో (ఇంక్రిమెంటల్‌ సేల్స్‌) సగానికి పైగా వాటా ఈ ప్రాంతాలదే. మార్కెట్‌ అనలిటిక్స్‌ సంస్థ జాటో డైనమిక్స్‌ రిపోర్టు ప్రకారం.. గడిచిన పది నెలల్లో మెట్రోయేతర పట్టణ ప్రాంతాల్లో కార్లు, ఇతర పీవీల అదనపు విక్రయాలు 3,89,401 యూనిట్లకు పెరిగాయి. అన్ని ప్రాంతాల్లో నమోదైన పీవీల అదనపు విక్రయాల్లో ఇది దాదాపు 55 శాతమని నివేదిక వెల్లడించింది. ఈ కాలానికి మెట్రో నగరాల్లో అదనంగా అమ్ముడైన 1,55,698 యూనిట్లు, గ్రామీణ మార్కెట్లో అదనపు విక్రయాలు 1,61,965 యూనిట్ల మొత్తం కంటే అధికమని రిపోర్టు తెలిపింది. నిర్దేశిత కాలానికి అంచనాకు మించి నమోదైన విక్రయాలనే ఇంక్రిమెంటల్‌ సేల్స్‌గా వ్యవహరిస్తారు.

గడిచిన 10 నెలల్లో మెట్రోయేతర పట్టణ ప్రాంతాల్లో పీవీల రిజిస్ట్రేషన్లు వార్షిక ప్రాతిపదికన 17.5 శాతం వృద్ధితో 26.1 లక్షల కోట్లకు చేరాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి అమ్మకాలు 22.2 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. దేశవ్యాప్త పీవీల రిజిస్ట్రేషన్లలో ఈ ప్రాంతాల వాటాయే 57.3 శాతంగా ఉంది. వాహన కంపెనీలకు ఈ ప్రాంతాల ప్రాముఖ్యతను ఇది తెలియజేస్తుంది.


సమీక్షా కాలానికి దేశవ్యాప్త పీవీల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 18.4 శాతం వృద్ధితో 45.6 లక్షల యూనిట్లకు పెరిగాయి. గత ఏడాదిలో ఇదే కాలానికి అమ్మ కాలు 38.5 లక్షల యూనిట్లుగా ఉన్నాయి.

గ్రామీణ మార్కెట్లో పీవీల విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 27 శాతం పెరగగా.. దేశవ్యాప్త సేల్స్‌లో ఈ ప్రాంత వాటా 16.7 శాతంగా ఉంది. కాగా, మెట్రో నగరాల్లో పీవీల అమ్మకాలు 15.1 శాతం పెరగగా.. దేశవ్యాప్త విక్రయాల్లో ఈ ప్రాంతం వాటా 26 శాతంగా ఉంది.

ఇవి కూడా చదవండి..

బంగ్లాదేశ్‌లో అడుగుపెడితే షేక్ హసీనాకు ఉరిశిక్ష అమలు తప్పదు!

దాడికి సిద్ధంగా ఉన్నాం.. ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడి వార్నింగ్..

Updated Date - Nov 11 , 2026 | 05:36 AM