విస్తరణ బాటలో స్కోడా ఆటో ఇండియా
ABN , Publish Date - May 08 , 2026 | 01:52 AM
ఈ ఏడాది (2026) దేశవ్యాప్తంగా కొత్తగా 35 డీలర్‌షిప్స్ (కస్టమర్ టచ్ పాయింట్స్) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఈ ఏడాది (2026) దేశవ్యాప్తంగా కొత్తగా 35 డీలర్‌షిప్స్ (కస్టమర్ టచ్ పాయింట్స్) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు స్కోడా ఆటో ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 182 నగరాల్లో మొత్తం 330 టచ్ పాయింట్స్‌ను కంపెనీ నిర్వహిస్తోందని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే టచ్ పాయింట్స్‌లో నాలుగింటిని తెలంగాణ, ఏపీల్లో ఏర్పా టు చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ల్లో మొత్తం 19 టచ్‌పాయింట్స్‌ను నిర్వహిస్తోంది. ఏపీ, తెలంగాణ మార్కెట్లో కంపెనీ మార్కెట్ వాటా 12 శాతంగా ఉందన్నారు. 2025లో మొత్తం 73,000 పైగా కార్లను విక్రయించగా ఈ ఏడాది విక్రయాల్లో 8-10 శాతం వృద్ధిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన వివరించారు. కాగా భారత మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుప్తా తెలిపారు.
ఇవి కూడా చదవండి..
భారత్ మళ్లీ దాడి చేస్తే ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది: పాక్ రక్షణ మంత్రి
పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..