Share News

6 రోజుల శిశువు పేరిట డీమాట్ అకౌంట్.. ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే..

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:38 PM

ఇటీవల ఆరు రోజుల వయసున్న శిశువు ఆర్యా గోయెల్ పేరిట ఆమె తల్లిదండ్రులు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. దేశంలో అత్యంత పిన్నవయసున్న డిమాట్ అకౌంట్‌ హోల్డర్‌గా కొత్త రికార్డు సృష్టించింది.

6  రోజుల శిశువు పేరిట డీమాట్ అకౌంట్.. ఈ కొత్త ట్రెండ్ ఏంటంటే..
Arya Goel, youngest Demat account holde

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఆరు రోజుల వయసున్న శిశువు ఆర్యా గోయెల్ పేరిట ఆమె తల్లిదండ్రులు డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశారు. దేశంలో అత్యంత పిన్నవయసున్న డిమాట్ అకౌంట్‌ హోల్డర్‌గా కొత్త రికార్డు సృష్టించింది. 12 రోజుల శిశువుకు డిమాట్ అకౌంట్ పేరిట ఉన్న రికార్డును ఈ శిశువు అధిగమించింది. నడక నేర్చే ముందే ఆ శిశువు ఇన్వెస్ట్‌మెంట్‌ల ప్రపంచంలో కాలుపెట్టింది. మరీ రోజుల వయసున్న శిశువు పేరిట ఇలాంటి అకౌంట్స్ ఓపెన్ చేయడం కాస్త అరుదైన విషయమే అయినా ఈ కాలంలో అనేక మంది తల్లిదండ్రులు తమ చిన్న వయసులోనే పెట్టుబడులకు సిద్ధం అవుతున్న వైనాన్ని ఈ ఉదంతం సూచిస్తోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు.


మైనర్లకు డీమాట్ అకౌంట్ ఓపెనింగ్ ఇలా..

మైనర్ల పేరిట డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు, మైనర్లకు ఇచ్చే పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆర్య గోయెల్ తల్లిదండ్రులు వీటిని రోజుల వ్యవధిలోనే సమకూర్చుకున్నారు. ఆర్య మేజర్ అయ్యే వరకూ ఆమె తరఫున తల్లిదండ్రులే పెట్టుబడులు పెడతారు. కూతురికి 18 ఏళ్ల వచ్చాక అకౌంట్‌ను ఆమెకు అప్పగిస్తారు. ఇటీవల కాలంలో అనేక మంది తమ సంతనం మైనర్లుగా ఉన్న సమయంలోనే వారి పేరిట స్టాక్‌మార్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్‌లలో పెట్టుబడి పెడుతున్నారు. అంతకంతకూ పెరుగుతున్న విద్య, వైద్య ఖర్చుల నేపథ్యంలో ముందస్తు ప్లానింగ్ బెటరని భావిస్తున్నారు. దీర్ఘ కాలిక ఆర్థిక లక్ష్యాలను పూర్తి చేసేందుకు ఇదే అత్యుత్తమ మార్గమని అంటున్నారు.


పిల్లల పేరిట డీమాట్ అకౌంట్ ఓపెన్ చేశాక ఇక అంతా సవ్యంగా సాగిపోతుందని అనుకోవడం పొరపాటని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రుల పెట్టుబడుల తీరుపై అంతిమంగా లాభాలు ఆధారపడి ఉంటాయి. మార్కెట్ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలతో వచ్చే రిస్కులను అర్థం చేసుకుని తల్లిదండ్రులు ముందడుగు వేయాలి. గతంలో కూడా అనేక మంది తమ సంతానానికి చిన్న వయసులోనే డీమాట్ అకౌంట్ ఏర్పాటు చేయగలిగారు. ఆర్థికంగా ఓ స్థిరమైన పునాది ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నామని ఆయా చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

బంగారం, వెండి కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..

వచ్చే ఏడాది భారత్‌ ఐటీ వ్యయం రూ.17 లక్షల కోట్లు

Updated Date - Nov 18 , 2026 | 04:59 PM