వచ్చే ఏడాది భారత్ ఐటీ వ్యయం రూ.17 లక్షల కోట్లు
ABN , Publish Date - Nov 18 , 2026 | 05:55 AM
మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయం వచ్చే ఏడాది (2027)లో 10 శాతం మేర పెరిగి రూ.16.9 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బిజినెస్, టెక్నాలజీ ఇన్‌సైట్స్ కంపెనీ గార్ట్‌నర్...
గార్ట్‌నర్ అంచనా
న్యూఢిల్లీ: మన దేశంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వ్యయం వచ్చే ఏడాది (2027)లో 10 శాతం మేర పెరిగి రూ.16.9 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని బిజినెస్, టెక్నాలజీ ఇన్‌సైట్స్ కంపెనీ గార్ట్‌నర్ మంగళవారం వెల్లడించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్-యాజ్-సర్వీస్ (ఐఏఏఎస్) విభాగం ఈ ఏడాదిలో అత్యధిక వృద్ధిని నమోదు చేసే అవకాశం ఉందని తెలిపింది. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (జీసీసీ) విస్తరణ, కృత్రిమ మేధ (ఏఐ)కు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, క్లౌడ్ సర్వీసులకు పెరుగుతున్న డిమాండ్‌తో పాటు సైబర్ సెక్యూరిటీ, సావరిన్ సామర్థ్యాలు, డేటా ఆధునికీకరణలో పెట్టుబడులు వంటివి సంస్థల టెక్నాలజీ వ్యయం వృద్ధికి కారణం కానున్నాయి. ఇకపై ఏఐని ఒక ప్రత్యేక సాంకేతిక పెట్టుబడిగా కాకుండా వ్యాపార వృద్ధి, డిజిటల్ పోటీతత్వానికి పునాదిగా సంస్థలు పరిగణిస్తున్నాయని గార్ట్‌నర్ వైస్‌ప్రెసిడెంట్ అనలిస్ట్ డీడీ మిశ్రా పేర్కొన్నారు. కాగా ఆర్థిక సేవలు, ప్రభుత్వ రంగాల్లో ఐఏఏఎ్‌సకు బలమైన డిమాండ్ ఉందని, పెరుగుతున్న డిజిటల్ అవసరాలకు అనుగుణంగా క్లౌడ్ మౌలిక సదుపాయాలను నిరంతరం విస్తరించుకోవాల్సి ఉంటుందని గార్ట్‌నర్ సీనియర్ డైరెక్టర్ అనలిస్ట్ నరేష్ సింగ్ తెలిపారు.
భారత్‌లో డేటా సెంటర్ వ్యవస్థలపై వ్యయం వచ్చే ఏడాదిలో వార్షిక ప్రాతిపదికన 28.4 శాతం వృద్ధితో రూ.1.2 లక్షల కోట్లకు పెరిగే అవకాశం ఉంది. ఇక సాఫ్ట్‌వేర్‌పై వ్యయం 2026తో పోల్చితే దాదాపు 19 శాతం పెరిగి రూ.2.6 లక్షల కోట్లను దాటే అవకాశం ఉంది.
ఐఏఏఎస్ విభాగంలో 2026లో మొత్తం వ్యయం రూ.58,000 కోట్లను మించవచ్చని అంచనా. ఈ వ్యయం వార్షిక ప్రాతిపదికన 40 శాతం పెరిగి వచ్చే ఏడాదిలో రూ.81,580 కోట్లను చేరవచ్చు.
ఇవి కూడా చదవండి..
హోర్ముజ్ జలసంధిలో మరో నౌకపై దాడి.. ఒమన్ తీరానికి సమీపంలో ట్యాంకర్‌కు మంటలు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..