Share News

మార్కెట్లోకి సింపుల్‌ వేవ్‌ ఈ-స్కూటర్‌

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:06 AM

తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీ సింపుల్‌ ఎనర్జీ బుధవారం ‘సింపుల్‌ వేవ్‌’ పేరుతో...

మార్కెట్లోకి సింపుల్‌ వేవ్‌ ఈ-స్కూటర్‌

బెంగళూరు: తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)కు సిద్ధమవుతున్న ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీ సింపుల్‌ ఎనర్జీ బుధవారం ‘సింపుల్‌ వేవ్‌’ పేరుతో తన తొలి ఫ్యామిలీ ఈ-స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మూడు వేరియంట్లలో లభించనున్న దీని ప్రవేశ ధర రూ.1,09,999గా ఉంది. 5 కిలోవాట్‌ బ్యాటరీతో కూడిన వేవ్‌ ప్లస్‌ వేరియంట్‌ స్కూటర్‌ సింగిల్‌ చార్జింగ్‌తో 243 కిలోమీటర్లు ప్రయాణించగలదు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదని కంపెనీ తెలిపింది. కాగా, తమ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యాలను పెంచుకునేందుకు భారీగా నిధులు సమీకరించే ఆలోచనలో ఉన్నట్లు సింపుల్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:06 AM