Share News

వెండి వెలవెల

ABN , Publish Date - Feb 02 , 2026 | 06:44 AM

బులియన్‌ మార్కెట్లో వెండి మరో భారీ పతనాన్ని నమోదు చేసింది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ ట్రేడ్‌లో మార్చి డెలివరీకి ఉద్దేశించిన వెండి కిలో రూ.26,273 క్షీణించి...

వెండి వెలవెల

బులియన్‌ మార్కెట్లో వెండి మరో భారీ పతనాన్ని నమోదు చేసింది. ఎంసీఎక్స్‌ ఫ్యూచర్స్‌ ట్రేడ్‌లో మార్చి డెలివరీకి ఉద్దేశించిన వెండి కిలో రూ.26,273 క్షీణించి రూ.2,65,652 వద్ద ముగిసింది. వెండి ధరల పతనం వరుసగా ఇది రెండో రోజు. శుక్రవారం నాటి సెషన్‌లో కిలో వెండి ఒక్కసారిగా రూ.1,07,968 (27ు) క్షీణించింది. దీంతో రెండు వరుస సెషన్లలో కిలో వెండి రూ.1,34,241 (33.6ు) పడిపోయింది. గత నెల 23వ తేదీన కిలో వెండి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.3,34,699 పలికింది. కాగా గోల్డ్‌ ఫ్యూచర్స్‌ కూడా ఆదివారం భారీ ఆటుపోట్లకు లోనయింది. ఏప్రిల్‌ కాంట్రాక్టులకు ఉద్దేశించిన రూ.10 గ్రాముల బంగారం 9ు నష్టపోయి రూ.1,38,634 వరకు దిగజారి దిగువ సర్క్యూట్‌ను తాకినా చివరికి నష్టాన్ని 3 శాతానికి కుదించుకుని రూ.1,48,104 వద్ద ముగిసింది.

ఇవీ చదవండి:

ఆ సంస్థలకు 2047 వరకూ ట్యాక్స్ హాలిడే: మంత్రి నిర్మలా సీతారామన్

2019 నుంచి 2026 వరకు.. 9 బడ్జెట్లు.. 14 గంటల ప్రసంగం..

Updated Date - Feb 02 , 2026 | 06:48 AM