Share News

వెండి @ 4,00,000

ABN , Publish Date - Jan 29 , 2026 | 06:44 AM

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వెండి, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అప్పుడప్పుడూ దూకుడుకు స్వల్ప విరామం ఇచ్చినా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి...

వెండి @ 4,00,000

హైదరాబాద్‌లో జీవితకాల గరిష్ఠ ధర.. 28 రోజుల్లోనే రూ.1.44 లక్షలు పెరుగుదల

న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వెండి, బంగారం ధరలు ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నాయి. అప్పుడప్పుడూ దూకుడుకు స్వల్ప విరామం ఇచ్చినా నూతన సంవత్సరం ప్రారంభం నుంచి బులియన్‌ మార్కెట్లో బుల్స్‌ చెలరేగిపోతున్నాయి. తాజాగా బుధవారం హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి ధర చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.4 లక్షలకు చేరింది. మంగళవారం నాటి ధర తో పోల్చితే రూ.13,000 పెరిగింది.

గత 28 రోజుల్లోనే ధర రూ.1.44 లక్షలు పెరిగింది. ఎంసీఎక్స్‌లో సైతం మార్చి నెల ఫ్యూచర్‌ కాంట్రాక్టుల ధర 5.62ు పెరిగి రూ.3,79,300 (పన్నులతో కలిపి) పలికింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర రూ.15,000 పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.3.85 లక్షలకు చేరింది. ఇక్కడ రెండు రోజుల్లోనే ధర రూ.55,500 పెరిగింది.

ఇంకా పైపైకే: కామెక్స్‌లో ఔన్సు (31.10 గ్రాములు) వెండి ధర 115.42 డాలర్లు పలికింది. ఈ ధర 106.55-113 డాలర్ల వద్ద కన్సాలిడేట్‌ అవుతోంది. మరింతగా దూసుకుపోయే మొగ్గుతో ధర అన్ని చలన సగటు స్థాయిల కన్నా పైనే కదలాడుతోంది. స్పాట్‌ వెండి ధర సైతం 0.12ు పెరిగి 112.22 డాలర్ల వద్ద స్థిరపడింది. ఔన్సు ధర 118.50-120 డాలర్లు దాటినట్లయితే 125-140 డాలర్లకు దూసుకుపోయే అవకాశం ఉన్నదని మార్కెట్‌ విశ్లేషకులంటున్నారు.

బంగారం రూ.5,000 పెరుగుదల: బులియన్‌ మార్కెట్లో వరుసగా ఎనిమిదో రోజు కూడా బంగారం ధర కూడా రికార్డు స్థాయిలకు దూసుకుపోయింది. బుధవారం ఢిల్లీ మార్కెట్లో రూ.5,000 పెరిగిన 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1.71 లక్షల వద్ద స్థిరపడింది.

ఇవీ చదవండి:

ఈయూతో వాణిజ్య ఒప్పందం.. ఫార్మాకు లాభం.. ఆటోకు కష్టం

నార్త్ బ్లాక్‌లో బడ్జెట్ హల్వా వేడుక.. వారంతా ఐదు రోజుల పాటు అక్కడే..

Updated Date - Jan 29 , 2026 | 07:10 AM