Silver Price Hits Record High: మరింత పెరిగిన వెండి ధర
ABN , Publish Date - Jan 14 , 2026 | 05:53 AM
దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మరో పతాక స్థాయికి చేరాయి. ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర మరో రూ.6 వేలు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి...
న్యూఢిల్లీ: దేశీయ విపణిలో బంగారం, వెండి ధరలు మరో పతాక స్థాయికి చేరాయి. ఢిల్లీలో మంగళవారం కిలో వెండి ధర మరో రూ.6 వేలు పెరిగి జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.2.71 లక్షలు పలికింది. సోమవారం వెండి ధర ఏకంగా రూ.15 వేలు పెరిగింది. వరుసగా మూడు రోజు ల్లో వెండి ధర కిలో 21,000 (8.4ు) పెరిగింది. ఈ ఏడా ది ఇప్పటి వరకు రూ.32,000 పెరిగింది. డిసెంబరు 31వ తేదీన కిలో వెండి ధర రూ.2.39 లక్షలుంది. ఇక 99.9ు నాణ్యత గల బంగారం 10 గ్రాములు రూ.400 పెరిగి జీవిత కాల గరిష్ఠం రూ.1,45,000 తాకింది. సోమవారం సెషన్‌లో బంగారం ధర రూ.2,900 పెరిగింది.
ఇవీ చదవండి:
అల్ ఫలా వర్సిటీ క్యాంపస్ అటాచ్!
వారాణసీ స్కూళ్లలో తమిళం తరగతులు!