Share News

ఏడాదిలో 77 లక్షల వెండి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:08 AM

గత ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు 77 లక్షల వెండి ఆభరణాలు, ఉత్పత్తులకు ఆరు అంకెల హాల్‌మార్క్‌ యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) సంఖ్యను జారీ చేసినట్లు...

ఏడాదిలో 77 లక్షల వెండి ఆభరణాలకు హాల్‌ మార్కింగ్‌

న్యూఢిల్లీ: గత ఏడాది సెప్టెంబరు నుంచి ఇప్పటి వరకు 77 లక్షల వెండి ఆభరణాలు, ఉత్పత్తులకు ఆరు అంకెల హాల్‌మార్క్‌ యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ (హెచ్‌యూఐడీ) సంఖ్యను జారీ చేసినట్లు బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ (బీఐఎస్‌) వెల్లడించింది. వెండి ఆభరణాల కోసం హెచ్‌యూఐడీతో హాల్‌మార్కింగ్‌ను 2025 సెప్టెంబరు 1న ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వెండి హాల్‌మార్కింగ్‌లో దక్షిణాది రీజియన్‌ 62 శాతంతో అగ్రస్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థా నంలో 18 శాతంతో తూర్పు రీజియన్‌, సెంట్రల్‌ రీజియన్‌ 10 శాతంతో ఉన్నాయని బీఐఎస్‌ పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి:

టాక్సిక్ మూవీపై తమిళనాడు నేత అన్నామలై విమర్శలు! మహిళల పరిస్థితి ఏమౌతుందో..

కోడిపందేలపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

Updated Date - Aug 29 , 2026 | 03:08 AM