Share News

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు రూ.208 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - Jun 09 , 2026 | 02:28 AM

హైదరాబాద్‌కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీకి భారీ ఆర్డర్‌ లభించింది. ఉత్తర అమెరికాకు చెందిన ఒక దేశం నుంచి రూ.208 కోట్ల విలువైన ఆర్డర్‌...

సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌కు రూ.208 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌కు చెందిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ కంపెనీకి భారీ ఆర్డర్‌ లభించింది. ఉత్తర అమెరికాకు చెందిన ఒక దేశం నుంచి రూ.208 కోట్ల విలువైన ఆర్డర్‌ లభించింది. ఈ ఆర్డర్‌ కింద కంపెనీ ‘155 ఎంఎం ఎం107’ శతఘ్నుల్లో ఉపయోగించే ఫిరంగి గుండ్లకు అవసరమైన 40,000 షెల్‌ బాడీస్‌ను సరఫరా చేస్తుంది. ఆరు నెలల్లో ఈ సరఫరా పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ తెలిపింది. భారత రక్షణ రంగ సంస్థల ఉత్పత్తి సామర్ధ్యంపై అంతర్జాతీయ సంస్థల నమ్మకానికి ఈ కాంట్రాక్టు ప్రతిబింబిస్తోందని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సీఈఓ కలిదిండి సునీల్‌ తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి...

పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఉమ్మడి నెల్లూరు జిల్లా కమిటీల రద్దు

16,300 టీచర్ పోస్టుల భర్తీపై గొడ్డలి పార్టీ విషం కక్కుతోంది: నిమ్మల

Read AP News Latest, Telangana News  And National News

Updated Date - Jun 09 , 2026 | 02:28 AM