Share News

సిగ్మా అడ్వాన్స్‌డ్‌కు రూ.107 కోట్ల ఆర్డర్‌

ABN , Publish Date - May 16 , 2026 | 03:05 AM

హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ రూ.107 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్‌ను...

సిగ్మా అడ్వాన్స్‌డ్‌కు రూ.107 కోట్ల ఆర్డర్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న రక్షణ రంగ ఉత్పత్తుల సంస్థ సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ రూ.107 కోట్ల విలువైన ఎగుమతి ఆర్డర్‌ను దక్కించుకున్నట్లు ప్రకటించింది. అమెరికాకు చెందిన ఒక ఖాతాదారుడి నుంచి ఈ ఆర్డర్‌ను అందుకున్నట్లు తెలిపింది. ఆర్డర్‌లో భాగంగా 155 ఎంఎం ఆర్టిలరీ (ఆయుధ) షెల్స్‌కు ఫిల్డ్‌ ఫ్యూజె్‌సను సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. పది నెలల కాలంలో ఈ కాంట్రాక్ట్‌ను పూర్తి చేయాల్సి ఉంటుందని తెలిపింది. అంతర్జాతీయ రక్షణ తయారీ రంగంలో కంపెనీ కార్యకలాపాలు మరింతగా విస్తరించేందుకు ఈ ఆర్డర్‌ దోహదపడుతుందని సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 03:05 AM