అపోలో హెల్త్‌టెక్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభన కామినేని
ABN , Publish Date - Jun 16 , 2026 | 01:50 AM
త్వరలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్న అపోలో హెల్త్‌టెక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమించాలని..
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): త్వరలో స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానున్న అపోలో హెల్త్‌టెక్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా శోభన కామినేనిని నియమించాలని అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ భావిస్తోంది. అయితే ఇది వాటాదారుల అనుమతికి లోబడి ఉంటుందని తెలిపింది. శోభన కామినేని ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ బోర్డులో ప్రమోటర్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. వైద్య పరికరాలు, హెల్త్‌కేర్ సొల్యూషన్స్ వ్యాపారంలో ఉన్న అనుబంధ సంస్థ ‘అపోలో హెల్త్‌టెక్’ను ప్రత్యేక కంపెనీగా విభజించి దాని షేర్లను ఈ ఆర్థిక సంవత్సరంలోనే లిస్టు చేయించాలని అపోలో హాస్పిటల్స్ భావిస్తోంది. లిస్టింగ్ నాటికి అపోలో హెల్త్‌టెక్ వార్షిక టర్నోవర్‌ను రూ25,000 కోట్లకు తీసుకువెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇవీ చదవండి:
పైలట్ డ్రెస్‌లో చిన్నారి.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వలేదుగా.!
టూరిస్టుల విచిత్ర విన్యాసం.. కారుపై అర్ధనగ్న ప్రయాణం!