Share News

మూడింతలు పెరిగిన నౌకా చార్జీలు ఫియో

ABN , Publish Date - Mar 10 , 2026 | 01:57 AM

పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో నౌకా రవాణా చార్జీలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందుతో పోలిస్తే భారత-గల్ఫ్‌ దేశాల మధ్య ఈ చార్జీలు ఎంతలేదన్నా మూడు రెట్లు పెరిగినట్టు ..

మూడింతలు పెరిగిన నౌకా చార్జీలు ఫియో

న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధంతో నౌకా రవాణా చార్జీలు భారీగా పెరిగాయి. యుద్ధానికి ముందుతో పోలిస్తే భారత-గల్ఫ్‌ దేశాల మధ్య ఈ చార్జీలు ఎంతలేదన్నా మూడు రెట్లు పెరిగినట్టు భారతీయ ఎగుమతి సంఘాల సమాఖ్య (ఫియో) పేర్కొంది. రవాణా చార్జీలతో పాటు ఇన్సూరెన్స్‌ ప్రీమియం, సర్‌ఛార్జీల భారం కూడా తడిసి మోపెడవుతోందని ఫియో డైరెక్టర్‌ జనరల్‌ అజయ్‌ సహాయ్‌ తెలిపారు. నౌకా కంపెనీలు ప్రస్తుతం భారత్‌ నుంచి గల్ఫ్‌ దేశాలకు వెళ్లే ఒక్కో కంటైనర్‌పై 1,500 నుంచి 4,000 డాలర్ల వరకు వార్‌ సర్‌చార్జీగా విధిస్తున్నాయని ఆయన చెప్పారు. దీంతో ప్రస్తుతం మన దేశం నుంచి గల్ఫ్‌ దేశాలకు జరిగే ఎగుమతులు ఎక్కడికక్కడ రేవుల్లో ఆగిపోయాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వచ్చే నెల 15 నుంచి గల్ఫ్‌ దేశాలకు పెద్దఎత్తున చిన్న చిన్న రవాణ నౌకలను నడపాలని నిర్ణయించినట్టు సహాయ్‌ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఇది 1.4 బిలియన్ల భారతీయుల ప్లాన్.. ఎక్స్‌లో గౌతీ

పాకిస్థాన్‌కు వరుణ్ చక్రవర్తి సెటైర్.. మరోసారి టీ కప్పుతో ట్రోలింగ్

Updated Date - Mar 10 , 2026 | 01:57 AM