Share News

7 కంపెనీలు.. రూ.6,400 కోట్ల సమీకరణ

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:22 AM

ఈ వారంలో ప్రైమరీ మార్కెట్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లతో బిజీబిజీగా మారనుంది. ఏడు కంపెనీలు తమ ఐపీఓల ద్వారా రూ.6,400 కోట్లకు పైగా నిధులను సమీకరించడానికి...

7 కంపెనీలు..  రూ.6,400 కోట్ల సమీకరణ

ఈ వారంలో పబ్లిక్‌ ఇష్యూల సందడి

న్యూఢిల్లీ: ఈ వారంలో ప్రైమరీ మార్కెట్‌ తొలి పబ్లిక్‌ ఆఫరింగ్‌ (ఐపీఓ)లతో బిజీబిజీగా మారనుంది. ఏడు కంపెనీలు తమ ఐపీఓల ద్వారా రూ.6,400 కోట్లకు పైగా నిధులను సమీకరించడానికి ఇన్వెస్టర్ల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాయి. హారిజన్‌ ఇండస్ర్టియల్‌ పార్క్స్‌ ఈ నెల 17న ఐపీఓకురానుంది. దీని ద్వారా కంపెనీ రూ.2,600 కోట్లు సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.57-60గా నిర్ణయించింది. ఇదే రోజున జువెలరీ రిటైలర్‌ లలితా జువెలరీ మార్ట్‌ రూ.1,700 కోట్ల ఇష్యూతో రానుంది. ఒక్కో షేరు ప్రైస్‌ బ్యాండ్‌ను రూ.190-201గా నిర్ణయించింది. రూ.1,700 కోట్ల ఇష్యూలో తాజా ఇష్యూ రూ.1,200 కోట్ల వరకు ఉండగా.. ఓఎ్‌ఫఎస్‌ రూ.500 కోట్ల వరకు ఉంది. ఈ నెల 18న శంకేశ్‌ జువెలర్స్‌ (రూ.367 కోట్లు)తోపాటు ఫిల్మ్‌, టెలివిజన్‌ ప్రొడ్యూసర్‌ సన్‌షైన్‌ పిక్చర్స్‌ (రూ.282 కోట్లు) తమ ఐపీఓలతో వస్తున్నాయి. గజా ఆల్టర్నేటివ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ ఈ నెల 19న తన రూ.550 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. 20న టెంప్‌సెన్స్‌ ఇన్‌స్ర్టుమెంట్స్‌ (ఇండియా) తన ఇష్యూతో రానుంది. ఇంటిగ్రేటెడ్‌ గోల్డ్‌ అండ్‌ సిల్వర్‌ ప్లాట్‌ఫామ్‌ అగ్మోంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆగస్టు 21న రూ.825 కోట్ల ఐపీఓను ప్రారంభించనుంది. ఇష్యూలతో కలిపి ఈ ఏడాదిలో ఐపీఓలతో వచ్చిన కంపెనీల సంఖ్య 55కు పెరగనుంది.

వార్తలు కూడా చదవండి...

జీఆర్ఎంబీ అజెండా నుంచి తెలంగాణ వ్యతిరేక అంశాలు తొలగించాలి: హరీశ్‌రావు

నేరాల స్వరూపం ఎప్పటికప్పుడు మారుతోంది: డీజీపీ ఆనంద్

నకిలీ ట్రేడింగ్ యాప్‌తో బురిడీ.. సీఏను మోసం చేసిన సైబర్ కేటుగాళ్లు

Updated Date - Aug 17 , 2026 | 05:22 AM