రెండేళ్లలో 1,000 నియామకాలు: ఫినోమ్
ABN , Publish Date - Aug 20 , 2026 | 05:48 AM
అంతర్జాతీయ హెచ్‌ఆర్ టెక్నాలజీ సంస్థ ఫినోమ్.. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 1,000 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. బుధవారం నాడిక్కడ కంపెనీ సీఈఓ...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): అంతర్జాతీయ హెచ్‌ఆర్ టెక్నాలజీ సంస్థ ఫినోమ్.. వచ్చే రెండేళ్లలో భారత్‌లో 1,000 మంది నిపుణులను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. బుధవారం నాడిక్కడ కంపెనీ సీఈఓ, కో- ఫౌండర్ మహే బైరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఫినోమ్.. హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరుల్లో కార్యాలయాల ను నిర్వహిస్తోందన్నారు. ఈ సెంటర్లలో మొత్తం 1,000కి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు. హెచ్‌ఆర్ సేవలకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా రానున్న రెండేళ్లలో కొత్తగా 1,000 మంది నిపుణులను నియమించుకోవాలని చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా కేంద్రంగా ఉన్న ఫినోమ్‌కు మైక్రోసాఫ్ట్, హనీవెల్, సౌత్‌వె్‌స్ట ఎయిర్‌లైన్స్, డాక్టర్ రెడ్డీస్, క్యాప్‌జెమినీ, ఎన్‌టీటీ డేటా, రాయల్ ఎన్‌ఫీల్డ్, ఎలీ లిల్లీ.. కస్టమర్లుగా ఉన్నాయి.
ఈ వార్తలనూ చదవండి: