సెన్సెక్స్, నిఫ్టీ డౌన్.. మదుపర్లకు నష్టాలు!
ABN , Publish Date - Jun 23 , 2026 | 03:57 PM
స్టాక్ మార్కెట్ నేడు మదుపర్లకు నష్టాలను మిగిల్చింది. సెన్సెక్స్ 893 పాయింట్ల మేర పతనం కాగా నిఫ్టీ 234 పాయింట్ల మేర కోల్పోయింది. ఐటీ రంగంలో నేడు కూడా అమ్మకాలు కొనసాగాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. ఐటీ రంగంతో పాటు లోహాలు, కమోడీటీ షేర్ల అమ్మకాలు కొనసాగడంతో సూచీలు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 893 పాయింట్ల నష్టంతో 76,200.28 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 278 పాయింట్ల నష్టంతో 23,824 వద్ద క్లోజైంది. బ్యాకింగ్ రంగంలో అమ్మకాలు కనిపించడంతో మదపర్లుకు నష్టాలు మిగిలాయి. ఈ సీజన్‌లో లోటు వర్షపాతం కారణంగా వ్యవసాయ రంగంపై ప్రతికూల ప్రభావం పడవచ్చన్న అంచనాలు కూడా మదుపర్ల సెంటీమెంట్‌ను దెబ్బతీశాయి. అయితే, ఫార్మా, హెల్త్‌కేర్ రంగంలో కొనుగోళ్లు పెరగడంతో సూచీల పతనానికి కొంత మేర అడ్డుకట్టు పడింది.
రంగాల వారీగా చూస్తే నిఫ్టీ మెటల్ సూచీ 3 శాతం మేర పతనమైంది. నిఫ్టీ ఐటీ కూడా నష్టాలను మూటగట్టుకుంది. నిఫ్టీ ఫార్మా, నిఫ్టీ హెల్త్‌కేర్ సూచీలు మాత్రం లాభాల్లో ముగిశాయి. ఇక నిఫ్టీ మిడ్ క్యాప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 1.10 శాతం, 0.58 శాతం మేర నష్టాలను ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్ (0.95 శాతం), మారుతీ షేర్లు (0.07 శాతం) స్వల్ప లాభాలతో ముగిశాయి. ఇన్ఫోసిస్, జేఎస్‌డబ్ల్యూ, టాటా కన్సల్టెన్సీ షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి.
ఈ వార్తలనూ చదవండి:
గోల్డ్ రేట్స్.. మళ్లీ పడిపోయిన ధరలు
ఏఐ కారణంగా లేఆఫ్స్.. ఒరాకిల్ ధ్రువీకరణ