చమురు తగ్గె.. సూచీలు ఎగిసె
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:31 AM
గత వారమంతా నష్టాల్లో పయనించిన భారత స్టాక్ మార్కెట్‌కు ఊరట లభించింది. ఐదు రోజుల నష్టాలకు తెరిదించిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. అమెరికా-ఇరాన్ పరస్పర...
సెన్సెక్స్ 776 పాయింట్లు అప్
ముంబై: గత వారమంతా నష్టాల్లో పయనించిన భారత స్టాక్ మార్కెట్‌కు ఊరట లభించింది. ఐదు రోజుల నష్టాలకు తెరిదించిన సూచీలు సోమవారం ట్రేడింగ్‌లో లాభాల బాట పట్టాయి. అమెరికా-ఇరాన్ పరస్పర దాడులను తాత్కాలికంగా నిలిపివేయడంతో ముడి చమురు ధరలు భారీగా తగ్గడం ఇందుకు దోహదపడింది. ఒక దశలో 841 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. చివరికి 776.01 పాయింట్ల (1.02 శాతం) లాభంతో 76,835.78 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 228.50 పాయింట్ల (0.96 శాతం) వృద్ధితో 23,995.95 వద్ద ముగిసింది. ఈక్విటీ మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.5.10 లక్షల కోట్లు పెరిగి రూ.480.80 లక్షల కోట్లకు (5 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. ఫారెక్స్ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం విలు వ ఏకంగా 54 పైసలు లాభపడి రూ.95.92 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు పీపా ధర ఒక దశలో 9.40 శాతం తగ్గి 87.64 డాలర్లకు జారుకుంది.
ఇవీ చదవండి:
పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..
విద్యార్థులపై దాడులు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ