Share News

రిలయన్స్‌, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

ABN , Publish Date - Oct 07 , 2026 | 12:55 AM

భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 685.34 పాయింట్లు బలపడి...

రిలయన్స్‌, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు

సెన్సెక్స్‌ 685 పాయింట్లు అప్‌ జూరూ.4.54 లక్షల కోట్ల సంపద వృద్ధి

ముంబై: భారత స్టాక్‌ మార్కెట్‌ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. మంగళవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 685.34 పాయింట్లు బలపడి 73,067.81 వద్దకు చేరుకోగా.. నిఫ్టీ 220.35 పాయింట్ల లాభంతో 22,776.10 వద్ద ముగిసింది. మదుపరుల సంపదగా భావించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ రూ.4.54 లక్షల కోట్లు పెరిగి రూ.473.61 లక్షల కోట్లకు(4.91 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. చమురు ధర 100 డాలర్ల దిగువకు జారుకోవడం, రిలయన్స్‌ ఇండస్ట్రీ్‌సతోపాటు బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్లు ఇందుకు దోహదపడ్డాయి. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 21 రాణించగా.. ట్రెంట్‌ షేరు ఏకంగా 12.78 శాతం ఎగబాకి సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది.

మూడో అతిపెద్ద లిస్టెడ్‌ కంపెనీగా జియో

రిలయన్స్‌ ఇండస్ట్రీసకు చెందిన టెలికాం, డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ లిమిటెడ్‌.. స్టాక్‌ మార్కెట్లో షేర్ల నమోదు ద్వారా దాదాపు రూ.12-13 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో టాప్‌-3 లిస్టెడ్‌ కంపెనీల్లో ఒకటిగా అవతరించే అవకాశం ఉంది. జియో ఐపీఓ ఈనెల 21న ప్రారంభమై 23న ముగియనుందని సమాచారం. 28న షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ల్లో లిస్ట్‌ చేయవచ్చు. ఐపీఓలో భాగంగా కంపెనీ పూర్తిగా తాజా ఈక్విటీ షేర్లనే జారీ చేయనుందని.. ప్రస్తుత వాటాదారులెవ్వరూ తమ వాటా షేర్లను విక్రయించే ఆలోచనలో లేరని తెలిసింది.

ఈ వార్తలనూ చదవండి:

మరోసారి ట్రిలియనీర్‌గా మస్క్

ఫిన్‌ఫ్లుయెన్సర్లతో జర జాగ్రత్త.. సెబీ చైర్మన్ సూచన

Updated Date - Oct 07 , 2026 | 12:58 AM