Share News

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!

ABN , Publish Date - Nov 05 , 2026 | 04:40 PM

స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. 2 వేల పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగియగా నిఫ్టీ 24,500 మార్కును దాటింది.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు!
Sensex, Nifty Rally today

ఇంటర్నె్ట్ డెస్క్: దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి. 2 వేల పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ముగియగా నిఫ్టీ 24,500 మార్కును దాటింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఫైనాన్షియల్, రియల్టీ రంగాల షేర్లు లాభాలతో ముగిశాయి. యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏర్పడిన సానుకూల వాతావరణం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు తొలగుతాయన్న ఆశలు, దేశంలోకి పెరిగిన విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ లాభాలు తదితర పరిణామాలు మార్కెట్‌లో జోష్ నింపాయి.

నేడు సెన్సెక్స్ 2,008.21 పాయింట్ల లాభంతో 79,310 వద్ద ముగిసింది. 78,710 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 79,470.03 గరిష్ఠాన్ని తాకింది. క్రితం ముగింపుతో పోలిస్తే 2.60 శాతం మేర ఎగబాకింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 50,576 పాయింట్ల లాభంతో 24,536.60 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 2.40 శాతం మేర లాభపడింది. ఇన్‌ట్రాడేలో 24,579.05 వద్ద గరిష్ఠాన్ని తాకింది.


బ్యాంకింగ్, ఆటో రంగాల ర్యాలీ..

సెన్సెక్స్‌లో కీలకమైన బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లు కొనుగోళ్లు నేడు జోరందుకున్నాయి. సెనెన్స్‌లో బజాజ్ ఫైనాన్స్ టాప్ గెయినర్‌గా (7.7 శాతం) నిలిచింది. ఇండిగో షేర్లు కూడా 5.80 శాతం మేర లాభపడ్డాయి. ఇక వివిధ రంగాల్లో పరిస్థితి అద్దం పట్టే సెక్టోరల్ సూచీలు కూడా లాభాలతో ముగిశాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 4.24 శాతం లాభంతో టాప్‌లో నిలిచింది.

అంతర్జాతీయ పరిణామాలు నేడు మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించాయని పరిశీలకులు చెబుతున్నారు. మిడ్‌టర్మ్ ఫలితాల నేపథ్యంలో ఇరాన్ యుద్ధం, వాణిజ్య విధానాల విషయంలో యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మెత్తబడతారన్న అంచనాలు సానుకూల సంకేతాలిచ్చాయి. ఈ నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు కూడా కాస్త శాంతించాయి.


ఈ వార్తలనూ చదవండి:

ప్రీమియర్‌ ఎనర్జీస్‌ ఆదాయం రూ.2,632 కోట్లు

పసిడి ప్రియులకు షాక్.. మరింత పెరిగిన బంగారం ధర

Updated Date - Nov 05 , 2026 | 05:00 PM