ప్రీమియర్ ఎనర్జీస్ ఆదాయం రూ.2,632 కోట్లు
ABN , Publish Date - Nov 05 , 2026 | 02:28 AM
సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ప్రీమియర్ ఎనర్జీస్ రూ.458 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ప్రీమియర్ ఎనర్జీస్ రూ.458 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో కంపెనీ ఆర్జించిన రూ.353 కోట్ల లాభంతో పోల్చితే 30ు వృద్ధి నమోదైంది. సమీక్షా కాలంలో ఆదాయం 43.3 శాతం పెరిగి రూ.1,837 కోట్ల నుంచి రూ.2,632 కోట్లకు పెరిగింది. కాగా ఒక్కో షేరుకు రూ.0.50 మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది. ఏపీలోని నాయుడుపేటలో రూ.5,947 కోట్లతో 10 గిగావాట్ ఇన్‌గాట్ అండ్ వేఫర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు ప్రాజెక్టుకు ప్రీమియర్ ఎనర్జీస్ గ్లోబల్ ఎన్విరాన్‌మెంట్ బోర్డు ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5 గిగావాట్ సామర్థ్యం వచ్చే ఏడాది డిసెంబరు చివరికల్లా పూర్తయ్యే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..
అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్ పరిస్థితేంటి..