Share News

సూచీల మిశ్రమ ముగింపు

ABN , Publish Date - Sep 18 , 2026 | 02:53 AM

అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడంతోపాటు ఈ ఏడాది మరోసారి పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో గురువారం సెన్సె క్స్‌, నిఫ్టీలు మిశ్రమంగా ముగిశాయి.

సూచీల మిశ్రమ ముగింపు
SENSEX

ముంబై: అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లను పెంచడంతోపాటు ఈ ఏడాది మరోసారి పెంపు ఉండవచ్చన్న సంకేతాలు ఇచ్చిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. దీంతో గురువారం సెన్సె క్స్‌, నిఫ్టీలు మిశ్రమంగా ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 21.86 పాయింట్ల నష్టంతో 74,314.59 వద్ద ముగియగా నిఫ్టీ 53 పాయింట్ల లాభంతో 23,270.60 వద్ద క్లోజైం ది. కాగా ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ తొలి రోజు 43 శాతం సబ్‌స్ర్కైబ్‌ అయ్యింది. ఐపీఓ ద్వారా మొత్తం 8.86 కోట్ల షేర్లను ఎన్‌ఎస్‌ఈ ఆఫర్‌ చేయగా తొలి రోజు 3.83 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

ఏ-వన్‌ స్టీల్స్‌ ఇష్యూ ధర రూ. 385-405: బెంగళూరు కేంద్రంగా ఉన్న ఏ-వన్‌ స్టీల్స్‌ ఇండియా లిమిటెడ్‌ తన రూ.405 కోట్ల ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ధరను రూ.385-405గా నిర్ణయించింది. ఈ నెల 24న ఇష్యూ ప్రారంభమై 28న ముగుస్తుంది. ఐపీఓలో భాగంగా రూ.355 కోట్ల విలువైన షేర్లను జారీ చేయనుండగా ఓఎ్‌ఫఎస్‌ ద్వారా ప్రమోటర్లు రూ.50 కోట్ల విలువైన షేర్లను విక్రయించనున్నారు.

నేటి నుంచి ఆక్సియమ్‌ గ్యాస్‌ ఐపీఓ: హైదరాబాద్‌కు చెందిన ఆక్సియమ్‌ గ్యాస్‌ ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌.. ఎస్‌ఎంఈ ఐపీఓ శుక్రవారం (18వ తేదీ) ప్రారంభ మై 22వ తేదీన ముగియనుంది. ఈ ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు రూ.50.75 కోట్లు సమీకరించనుంది. ఇష్యూలో భాగంగా ఒక్కో ఈక్విటీ షేరు ధరల శ్రేణిని రూ.51- 54గా నిర్ణయించారు. షేరు ముఖ విలువ రూ.5గా ఉంది. కాగా 10.70 లక్షల ఈక్విటీ షేర్లను ఒక్కోటి రూ.54 చొప్పున యాంకర్‌ ఇన్వెస్టర్లకు విక్రయించడం ద్వారా కంపెనీ రూ.5.77 కోట్లు సమీకరించింది.

ఈ వార్తలు కూడా చదవండి

యూపీఐ చార్జీలపై జీఎస్టీ

యూపీఐ ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయినా డబ్బులు కట్ అయ్యాయా? ఇలా చేయండి

Updated Date - Sep 18 , 2026 | 02:53 AM