మూడు రోజుల ర్యాలీకి బ్రేక్
ABN , Publish Date - Feb 06 , 2026 | 04:55 AM
స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ప్రామాణిక సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో...
సెన్సెక్స్ 504 పాయింట్లు డౌన్
ముంబై: స్టాక్ మార్కెట్లో మూడు రోజుల వరుస ర్యాలీకి తెరపడింది. ప్రామాణిక సూచీలు గురువారం భారీ నష్టాలను చవిచూశాయి. ఒక దశలో 666 పాయింట్లకు పైగా క్షీణించి 83,151 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని నమోదు చేసిన సెన్సెక్స్.. చివరికి 503.76 పాయింట్ల నష్టంతో 83,313.93 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 133.20 పాయింట్లు కోల్పోయి 25,642.80 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవడం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు వారాంతంలో ఆర్‌బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తమై విక్రయాలకు పాల్పడటం ఇందుకు కారణమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 13 పైసలు బలపడి రూ.90.34 వద్ద స్థిరపడింది.
ఇవి కూడా చదవండి..
భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది.. ఏ దేశం నుంచైనా చమురు కొనొచ్చు: రష్యా అధికార ప్రతినిధి
బంగారం, వెండి ముందుకే.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..