మళ్లీ 84,000 పైకి సెన్సెక్స్
ABN , Publish Date - Feb 10 , 2026 | 05:55 AM
స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సోమవారం ఒకదశలో 734 పాయింట్లు ఎగబాకి 84,314.68 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. చివరికి 485.35 పాయింట్ల లాభంతో...
26,000కు చేరువైన నిఫ్టీ
రూ.6 లక్షల కోట్ల సంపద వృద్ధి
ముంబై: స్టాక్ మార్కెట్ ప్రామాణిక సూచీలు వరుసగా రెండో రోజూ లాభపడ్డాయి. సోమవారం ఒకదశలో 734 పాయింట్లు ఎగబాకి 84,314.68 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. చివరికి 485.35 పాయింట్ల లాభంతో 84,064.75 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 228.55 పాయింట్లు పెరిగి 26,000 మైలురాయికి చేరువైనప్పటికీ, ఆఖర్లో 173.60 పాయింట్ల వృద్ధితో 25,867.30 వద్ద క్లోజైంది. భారత్- అమెరికా మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కుదరిన ఉత్సాహంలో ట్రేడర్లు జోరుగా కొనుగోళ్లకు పాల్పడటం ఇందుకు దోహదపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలు, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల (ఎ్‌ఫఐఐ) కొనుగోళ్లు కూడా ఇందుకు తోడయ్యాయి. దాంతో మన ఈక్విటీ మార్కెట్ సంపదగా పరిగణించే బీఎ్‌సఈ నమోదిత కంపెనీల మొత్తం మార్కెట్ విలువ (క్యాపిటలైజేషన్) ఒక్క రోజులో రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.473.34 లక్షల కోట్లకు (5.24 లక్షల కోట్ల డాలర్లు) చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 నమోదిత కంపెనీల్లో 22 రాణించాయి.
రూ.17,000 పెరిగిన వెండి
కిలో రూ.2.72 లక్షలకు చేరిక
అంతర్జాతీయ మార్కెట్లో ట్రెండ్‌కు అనుగుణంగా దేశీయంగానూ బంగారం, వెండి మళ్లీ ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఒక్కరోజే రూ.17,000 (6.66 శాతం) పెరిగి రూ.2,72,000కు చేరకుంది. 10 గ్రాముల మేలిమి(99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు రూ.1,300 పెరుగుదలతో రూ.1,58,500 పలికింది. అమెరికన్ డాలర్ మళ్లీ బలహీనపడిన నేపథ్యంలో ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ రేటు ఒక శాతానికి పైగా పెరిగి 5,012 డాలర్లకు చేరగా.. సిల్వర్ 2.81 శాతం వృద్ధితో 80.21 డాలర్ల స్థాయిలో ట్రేడైంది.
ఇవి కూడా చదవండి..
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..
బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..