మ్యూచువల్ ఫండ్లలో థర్డ్‌పార్టీ చెల్లింపులకు అనుమతి
ABN , Publish Date - May 21 , 2026 | 02:03 AM
కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్ పథకాల్లో థర్డ్ పార్టీ చెల్లింపులను అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ...
న్యూఢిల్లీ: కొన్ని సందర్భాల్లో మ్యూచువల్ ఫండ్ పథకాల్లో థర్డ్ పార్టీ చెల్లింపులను అనుమతించాలని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. ఉద్యోగి తరఫున కంపెనీ యాజమాన్యం పెట్టుబడులు పెట్టడం, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు (ఏఎంసీ) తమ డిస్ట్రిబ్యూటర్లకు మ్యూచువల్ ఫండ్ యూనిట్ల రూపంలో కమీషన్ చెల్లింపులు ఇందుకు ఉదాహరణలు. ప్రస్తుత నిబంధనల ప్రకారం.. ఏదైనా మ్యూచువల్ ఫండ్ పథకంలోకి పెట్టుబడులు ఇన్వెస్టరు సొంత బ్యాంక్ ఖాతా నుంచి, అది కూడా ఆర్‌బీఐ ధ్రువీకృత పేమెంట్ అగ్రిగేటర్ లేదా సెబీ గుర్తింపు కలిగిన క్లియరింగ్ కార్పొరేషన్ నుంచి మాత్రమే బదిలీ చేసుకునేందుకు వీలుంది.
ఇవి కూడా చదవండి..
రెండు వందల అడుగుల ఎత్తులో నిలిచిపోయిన రోలర్ కోస్టర్.. షాకింగ్ వీడియో వైరల్..
చంద్రయాన్-3 మరో సంచలనం.. విక్రమ్ ల్యాండర్ కీలక ఆవిష్కరణ.