Share News

నేటి నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో కీలక మార్పు.. పెట్టుబడిదారులపై దీని ప్రభావం?

ABN , Publish Date - Apr 01 , 2026 | 07:47 AM

ఈ రోజు నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో సెబీ ఒక కీలక మార్పును అమల్లోకి తెచ్చింది. మ్యూచువల్ ఫండ్ సంస్థలు తమ వద్ద ఉన్న బంగారం, వెండి విలువను లెక్కించే విధానంలో పారదర్శకతను పెంచడమే ఈ కొత్త నియమం ముఖ్య ఉద్దేశ్యం.

నేటి నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌ల విషయంలో కీలక మార్పు.. పెట్టుబడిదారులపై దీని ప్రభావం?
SEBI gold ETF rules 2026

ఆంధ్రజ్యోతి, ఏప్రిల్ 1: ఇప్పటివరకు, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లలో ఉన్న ఫిజికల్ గోల్డ్, సిల్వర్ విలువను లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) ధరల ఆధారంగా లెక్కించేవారు. కానీ ఈరోజు (ఏప్రిల్ 1, 2026) నుంచి స్పాట్ ప్రైస్ (Dotic Spot Price)పరిగణలోకి తీసుకోవాలి. మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇకపై దేశీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు (NSE, BSE) ప్రచురించే 'పోల్డ్ స్పాట్ ప్రైసెస్' (Polled Spot Prices) ఆధారంగా బంగారం, వెండి విలువను లెక్కించాలి. తద్వారా అన్ని ఫండ్ హౌస్‌లు ఒకే రకమైన ధరను అనుసరించేలా చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని సెబీ ఈ నియమాన్ని తీసుకోచ్చింది.


పెట్టుబడిదారులపై దీని ప్రభావం ఏమిటి?

గతంలో అంతర్జాతీయ ధరలను భారత రూపాయిలోకి మార్చి, ఇంపోర్ట్ డ్యూటీలు కలిపి లెక్కించేటప్పుడు చిన్నపాటి వ్యత్యాసాలు వచ్చేవి. ఇప్పుడు నేరుగా భారతీయ మార్కెట్ ధరలనే తీసుకోవడం వల్ల NAV (Net Asset Value) మరింత కచ్చితంగా ఉంటుంది. దేశీయంగా బంగారం ధర పెరిగినప్పుడు, ఈటీఎఫ్ ధర కూడా అంతే వేగంతో ప్రతిబింబిస్తుంది. అంతర్జాతీయ ధరలకు, స్థానిక ధరలకు మధ్య ఉండే వ్యత్యాసం వల్ల వచ్చే 'ట్రాకింగ్ ఎర్రర్' తగ్గుతుంది. అంతేకాదు, అన్ని మ్యూచువల్ ఫండ్స్ ఒకే ధరను ప్రామాణికంగా తీసుకోవడం వల్ల, పెట్టుబడిదారులు వివిధ పథకాలను పోల్చి చూడటం సులభమవుతుంది.


ఇవి కూడా చదవండి..

ఇరాన్ అణు కేంద్రక నగరంపై అమెరికా దాడులు.. వీడియో షేర్ చేసిన ట్రంప్..

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రతిపాదించిన సంచలన ప్రణాళిక

Updated Date - Apr 01 , 2026 | 07:58 AM