మార్జిన్ ట్రేడింగ్‌ను బలోపేతం చేస్తాం
ABN , Publish Date - Nov 19 , 2026 | 02:59 AM
మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్)ను బలోపేతం చేసే విషయాన్ని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చురుగ్గా...
ముంబై: మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ (ఎంటీఎఫ్)ను బలోపేతం చేసే విషయాన్ని క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి సెబీ చురుగ్గా పరిశీలిస్తోంది. ముంబైలో జరిగిన ఒక సదస్సుకు హాజరైన సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఈ విషయం చెప్పారు. ఇందుకోసం అనేక అంశాలను పరిశీలిస్తున్నట్టు ఆయన తెలిపారు. వీటిపై ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే ఆ విషయాలు వెల్లడిస్తామన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మార్జిన్ ట్రేడింగ్ ఫండింగ్‌పై కొన్ని పరిమితులు విధించే విషయాన్ని సెబీ పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అదే జరిగితే ట్రేడింగ్ వాల్యూమ్స్, విలువ పడిపోయే ప్రమాదం ఉందని బ్రోకరేజీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్ ఈ విషయం చెప్పడం విశేషం. దేశీయ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ సమయాన్ని పెంచే విషయం తమ పరిశీలనలో లేదని కూడా పాండే స్పష్టం చేశారు. ఆ విషయం అసలు తమకు ప్రాధాన్యతా అంశమే కాదన్నారు.
ఇవి కూడా చదవండి..
కశ్మీర్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు..
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..