Share News

‘సీఏఎస్‌’పై ఆందోళనలను విశ్లేషిస్తున్నాం..

ABN , Publish Date - Aug 18 , 2026 | 05:27 AM

ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్‌ యాక్షన్‌ సెషన్‌ (సీఏఎ్‌స) విధానం కొనసాగుతుందని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే స్పష్టం చేశారు. అయితే, కొత్త...

‘సీఏఎస్‌’పై ఆందోళనలను విశ్లేషిస్తున్నాం..

  • వాటి ఆధారంగా విధానాన్ని మెరుగుపరుస్తాం..

  • సెబీ చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే స్పష్టీకరణ

ముంబై: ఇటీవల ప్రవేశపెట్టిన క్లోజింగ్‌ యాక్షన్‌ సెషన్‌ (సీఏఎ్‌స) విధానం కొనసాగుతుందని క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీ చైర్మన్‌ తుహిన్‌ కాంత పాండే స్పష్టం చేశారు. అయితే, కొత్త విధానంతో ఎదురవుతున్న సమస్యల గురించి సంబంధిత వర్గాలు వ్యక్తపరిచిన ఆందోళనలపై విశ్లేషణ జరుగుతున్నదని, వాటి ఆధారంగా దీన్ని మెరుగుపరచనున్నట్లు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాండే చెప్పారు. అయితే, సీఏఎ్‌సను నిబంధనల్లో వేటిని సడలిస్తారు..? అని మీడియా వర్గాలు అడిగిన ప్రశ్నపై ఆయన వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. దేశీయ ఈక్విటీ మార్కెట్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దడంతో పాటు షేరు ముగింపు ధరలో మరింత పారదర్శకత్వం కోసం సెబీ ఈ నెల 3 నుంచి సీఏఎస్‌ ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానంలో ఫ్యూచర్‌ అండ్‌ ఆప్షన్స్‌ (ఎ్‌ఫ అండ్‌ ఓ)లో భాగమైన కంపెనీల షేర్ల ముగింపు ధరను వేలం ద్వారా నిర్ణయిస్తారు. సీఏఎస్‌ విధానంలో ఎఫ్‌ అండ్‌ ఓ జాబితాలోని షేర్లలో 3.15 గంటలకు సాధారణ ట్రేడింగ్‌ ముగుస్తుంది. ఆ సమయంలో ముగింపు ధర నిర్ణయానికి బదులు ఎక్స్ఛేంజీలు 3.15 గంటల నుంచి 3.35 గంటల వరకు (20 నిమిషాల పాటు) క్లోజింగ్‌ యాక్షన్‌ సెషన్‌ను నిర్వహిస్తాయి. ఆ సమయంలో నమోదయ్యే క్రయ, విక్రయాల ఆర్డర్ల ఆధారంగా ఎక్స్ఛేంజీలు క్లోజింగ్‌ ధరను నిర్ణయిస్తాయి. కానీ, కొత్త విధానంలో కంపెనీల షేర్ల ధరలు చివరి నిమిషాల్లో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, ఇది ఆప్షన్స్‌ ట్రేడర్లకు ఇబ్బందిగా మారుతోందని సామాజిక మాధ్యమాల్లో ఇన్వెస్టర్లు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెబీ చీఫ్‌ తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

మ్యూచువల్‌ ఫండ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ హేతుబద్ధీకరణ

మ్యూచువల్‌ ఫండ్ల రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను సెబీ పునరుద్ధరించింది. మ్యూచువల్‌ ఫండ్లకు ప్రాథమిక, తుది అనుమతుల జారీకి ఏకీకృత దరఖాస్తు విధానాన్ని ప్రవేశపెట్టింది. అదే సమయంలో ఫండ్లు తమ ఆర్థిక పరిపుష్టి, యాజమాన్యం, పాలన ప్రమాణాలు, నియంత్రణపరమైన పనితీరు రికార్డును సమగ్రంగా వెల్లడించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

పేదల ఆరోగ్యం.. మా బాధ్యత: సీఎం రేవంత్‌రెడ్డి

స్వీట్ షాపు లైసెన్స్ పునరుద్ధరణలో జాప్యం.. ఎఫ్‌డీఏపై హైకోర్టు గుస్సా

Updated Date - Aug 18 , 2026 | 05:27 AM