Share News

భారత మార్కెట్‌ ‘షాక్‌’ను తట్టుకోగలదు..

ABN , Publish Date - May 19 , 2026 | 02:20 AM

పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అయితే మార్కెట్‌ నియంత్రణ సంస్థ...

భారత మార్కెట్‌ ‘షాక్‌’ను తట్టుకోగలదు..

  • పశ్చిమాసియా సంక్షోభంపై బేఫికర్‌

  • సమస్య ముగిసిన వెంటనే ర్యాలీ

  • సెబీ చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే

భువనేశ్వర్‌: పశ్చిమాసియా సంక్షోభంతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ తీవ్ర ఆటుపోట్లకు లోనవుతోంది. అయితే మార్కె ట్‌ నియంత్రణ సంస్థ సెబీ చీఫ్‌ తుహిన్‌ కాంత పాండే మాత్రం ఈ విషయంపై పెద్ద గా ఆందోళన చెందడం లేదు. ఎలాంటి షాకులనైనా తట్టుకునే సత్తా భారత స్టాక్‌ మార్కెట్‌కు ఉందని భువనేశ్వర్‌లో జరిగిన ‘ప్రాంతీయ మదుపరుల అవగాహన సెమినార్‌’లో ఆయన ప్రకటించారు. ప్రపంచంలో ఒక చోట ఏదైనా సంక్షోభం తలెత్తితే, దాని ప్రభావం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలపైనా కనిపిస్తుందన్నారు. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో ముడి చమురు సరఫరాకు అంతరాయం ఏర్పడి ప్రపంచవ్యాప్తంగా దాని ధర కొండెక్కిందన్నారు. దీంతో అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఆటుపోట్లకు లోనై ద్రవ్యోల్బణానికి దారి తీస్తోందన్నారు. ఈ సంక్షోభం ముగిసిన వెంటనే భారత మార్కెట్‌ మళ్లీ గాడిలో పడుతుందని పాండే విశ్వాసం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి..

సీబీఎస్‌ఈ కీలక నిర్ణయం.. మార్కులు పెరిగితే రీ-ఎవాల్యుయేషన్ ఫీజు పూర్తిగా రీఫండ్..

ఉగ్రవాదికి బట్టతల కష్టాలు.. దాడులు చేయడానికి భారత్‌లోకి చొరబడి..

Updated Date - May 19 , 2026 | 02:20 AM