ఎస్‌బీఐ లాభాలు అదుర్స్
ABN , Publish Date - Feb 08 , 2026 | 02:08 AM
ఈ ఆర్థిక సంవత్సరం(2025-26)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఆర్థికంగా మంచి పనితీరు కనబరిచింది...
క్యూ3లో రూ.21,028 కోట్లు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం(2025-26)లో డిసెంబరుతో ముగిసిన మూడో త్రైమాసికం(క్యూ3)లో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఆర్థికంగా మంచి పనితీరు కనబరిచింది. ఈ కాలానికి బ్యాంకు అనుబంధ సంస్థలతో కలిసి (కన్సాలిడేటెడ్) రూ.1.85 లక్షల కోట్ల ఆదాయంపై రూ.21,317 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే కాలంలో నమోదైన రూ.18,853 కోట్లతో పోలిస్తే బ్యాంకు లాభం 13.06 శాతం పెరిగింది. అనుబంధ సంస్థల ఆర్థిక ఫలితాలను మినహాయించినా (స్టాండలోన్) ఎస్‌బీఐ ఈ క్యూ3లో రూ.1,40,915 కోట్ల ఆదాయంపై రికార్డు స్థాయిలో రూ.21,028 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే కాలంలో నమోదు చేసిన రూ.16,891 కోట్లతో పోలిస్తే ఇది 24.48ు ఎక్కువ. అనుబంధ సంస్థ ఎస్‌బీఐ మ్యూచువల్ ఫండ్ నుంచి రూ.2,200 కోట్లు ప్రత్యేక డివిడెండ్‌గా అందడం క్యూ3లో బాగా కలిసి వచ్చిందని బ్యాంకు చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి చెప్పారు.
Also Read:
మలేసియాలో త్వరలో కొత్త కాన్సులేట్.. ప్రవాస భారతీయల సమావేశంలో మోదీ
భారత రైతులకు పూర్తి రక్షణ.. ట్రేడ్ డీల్‌పై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్