Share News

SAPలో లేఆఫ్స్? 10 వేల మంది తొలగింపుపై యోచన

ABN , Publish Date - Nov 27 , 2026 | 07:51 AM

జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్ఏపీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. దాదాపు 10 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

SAPలో లేఆఫ్స్? 10 వేల మంది తొలగింపుపై యోచన
SAP Planning Layoffs

ఇంటర్నెట్ డెస్క్: జర్మనీకి చెందిన సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఎస్ఏపీ లేఆఫ్స్‌కు సిద్ధమవుతోంది. దాదాపు 10 వేల మందిని తొలగించేందుకు రంగం సిద్ధం అవుతున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏఐపై దృష్టి కేంద్రీకరించిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల్లో 9 శాతం మందిని తొలగించే యోచనలో ఉంది. ఈ విషయమై ఇప్పటికే వర్కర్లతో చర్చలు కూడా జరుపుతున్నట్టు సమాచారం. అయితే, మొత్తం ఎంతమందిని లేఆఫ్ చేస్తారనే దానిపై సంస్థ ఇంకా తుది నిర్ణయానికి రాలేదు.


ప్రాడక్ట్, ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లో తొలగింపులు అధికంగా ఉండనున్నాయి. గతంలో లేఆఫ్స్ సమయంలో ఉద్యోగుల మేలు కోసం వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌ను సంస్థ ప్రకటించింది. ప్రస్తుత లేఆఫ్స్‌తో పాటు ఎస్ఏపీ నాయకత్వంలో కూడా మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. 2027 మార్చి నాటికల్లా ఇద్దరు ఎగ్జిక్యూటివ్ బోర్డు మెంబర్లు తప్పుకోనున్నారు.


తమ ఉత్పత్తులకు ఏఐ ఫీచర్లను జోడించడంపై దృష్టిపెట్టిన ఎస్ఏపీ ఇందులో భాగంగానే లేఆఫ్స్‌ చేపడుతున్నట్టు సమాచారం. మే నెలలో జరిగిన కాన్ఫరెన్స్‌లో జూల్ వర్క్ పేరిట ఏఐ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇక తొలగింపులు ఉండవచ్చని గత వారమే కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డోమినిక్ తెలిపారు. ఇన్వెస్టర్లతో సమావేశం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే, ఈ తొలగింపులు ఎప్పుడు చేపడతారనే విషయంపై మాత్రం స్పష్టత లేదు. 2024లో చేపట్టిన లేఆఫ్స్ సందర్భంగా సంస్థ 10 వేల మందిని తొలగించింది.


ఈ వార్తలనూ చదవండి:

గోల్డ్ రేట్స్.. మీ నగరంలో ధరలు ఇవీ

చంద్రశేఖరన్ పునర్నియామకంపై బాంబే హైకోర్టుకు టాటా ట్రస్ట్‌లు

Updated Date - Nov 27 , 2026 | 07:51 AM