ముహురత్ ట్రేడింగ్.. లాభాల్లో సూచీలు
ABN , Publish Date - Nov 08 , 2026 | 02:48 PM
నూతన సంవత్ 2083ను స్వాగతిస్తూ నేడు నిర్వహిస్తున్న ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి.
ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్ 2083ను స్వాగతిస్తూ నేడు నిర్వహిస్తున్న ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్‌లో స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం 2.20 నుంచి 3.30 వరకూ నేడు ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. 270 పాయింట్ల లాభంతో 81,299.34 సెన్సెక్స్ ప్రారంభమైంది. నిఫ్టీ కూడా 25,070.45 వద్ద 40 పాయింట్ల లాభంతో మొదలైంది. ప్రస్తుతం రెండూ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా, కోటక్ మహీంద్రా, ఇండిగో మినహా మిగిలిన షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
మల్టీ కమోడీటీ ఎక్సేంజ్‌లో కూడా ఇదే సమయంలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ కొనసాగుతుంది. కొత్త సంవత్సరం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించే సంప్రదాయం ఎంతో కాలంగా కొనసాగుతోంది. ఈ రోజు స్టాక్స్ కొనుగోలుతో ఏడాదంతా సానుకూల పరిస్థితులు ఉంటాయని మదుపర్లు విశ్వసిస్తారు. గతవారం దేశీ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు లాభాల పంట పడించాయి. గత ఏడేళ్లల్లో ఎన్నడూ చూడని స్థాయిలో ఏకంగా 8 శాతం మేర పెరిగాయి.
ఈ వార్తలనూ చదవండి:
అంతర్జాతీయంగా 24 శాతం పతనమైన బంగారం ధరలు.. భారత్‌లో మాత్రం..