Share News

స్వల్ప నష్టాలతో ముగిసిన ముహురత్ ట్రేడింగ్

ABN , Publish Date - Nov 08 , 2026 | 04:02 PM

నూతన సంవత్ 2083ను స్వాగతిస్తూ నేడు నిర్వహించిన ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ సెషన్ స్వల్ప నష్టాలతో ముగిసింది.

స్వల్ప నష్టాలతో ముగిసిన ముహురత్ ట్రేడింగ్
Muhurat trading 2026

ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్ 2083ను స్వాగతిస్తూ నేడు నిర్వహించిన ప్రత్యేక ముహురత్ ట్రేడింగ్ సెషన్ స్వల్ప నష్టాలతో ముగిసింది. సాధారణంగా లాభాలతో ముగిసే ట్రేడింగ్ ఈసారి ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించడంతో నష్టాలతో ముగిసింది. మధ్యాహ్నాం 2.20 గంటలకు లాభాలతో ట్రేడింగ్ ప్రారంభమైంది. 270 పాయింట్ల లాభంతో 81,299.34 సెన్సెక్స్ ప్రారంభమై చివరకు 28.62 పాయింట్ల నష్టంతో 80,999.40 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 25,070.45 వద్ద 40 పాయింట్ల లాభంతో మొదలైంది. చివరకు 43.95 పాయింట్ల నష్టంతో 25,070 వద్ద ముగిసింది. ఈ సెషన్‌లో సన్‌ఫార్మా, టాటా స్టీల్, మారుతీ సుజుకీ తదితర సంస్థల షేర్లు లాభాలతో ముగిశాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండిగో, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాలను చవి చూశాయి.


ఈ వార్తలనూ చదవండి:

అంతర్జాతీయంగా 24 శాతం పతనమైన బంగారం ధరలు.. భారత్‌లో మాత్రం..

కొత్త సంవత్‌ తారాజువ్వలు

Updated Date - Nov 08 , 2026 | 04:15 PM