స్మార్ట్‌ఫోన్లు మరింత ప్రియం
ABN , Publish Date - Nov 17 , 2026 | 05:45 AM
స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే కాస్త ఆలోచించాల్సిందే. సోమవారం నుంచి సామ్‌సంగ్, షామీ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను మోడల్, స్టోరేజీని బట్టి ఒక్కో స్మార్ట్‌ఫోన్ ధరను...
19% వరకు పెరిగిన సామ్‌సంగ్, షామీ ఫోన్ల ధరలు
మెమోరీ చిప్స్, విడిభాగాల ధరలు పెరగడమే కారణం..
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే కాస్త ఆలోచించాల్సిందే. సోమవారం నుంచి సామ్‌సంగ్, షామీ కంపెనీలు తమ స్మార్ట్‌ఫోన్ల ధరలను మోడల్, స్టోరేజీని బట్టి ఒక్కో స్మార్ట్‌ఫోన్ ధరను 3.13 శాతం నుంచి 18.75 శాతం వరకు పెంచేశాయి. మెమోరీ చిప్స్, ఇతర విడిభాగాలు ధరలు పెరగడంతో ఈ పెంపు తప్పలేదని కంపెనీలవర్గాలు చెప్పాయి. మోడల్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ను బట్టి ధర పెంపు శ్రేణి రూ.1,000 నుంచి రూ.4,000 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. ఒప్పో, రియల్‌మీ, వివో కంపెనీలు కూడా త్వరలోనే తమ స్మార్ట్‌ఫోన్ల ధరలు పెంచుతాయని భావిస్తున్నారు.
కలిసిరాని పండుగల సీజన్..: ఈ ఏడాది పండగల సీజన్ అమ్మకాలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలకు పెద్దగా కలిసి రాలేదు. గత ఏడాది పండగల సీజన్‌తో పోలిస్తే అమ్మకాలు 18 నుంచి 20 శాతం వరకు పడిపోయాయి. మరోవైపు పెరిగిన చిప్స్, విడిభాగాల ధరలతో కంపెనీల లాభాలకూ గండి పడింది. దీంతో దీపావళి వరకు ఓపిక పట్టిన కంపెనీలు పండగల సీజన్ ముగియడంతోనే వడ్డింపు ప్రారంభించాయి. ఈ ప్రభావం ఎంట్రీ లెవల్, మిడ్ లెవల్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలపై ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.
ఇవీ చదవండి
జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!