సామ్‌సంగ్ ఉద్యోగులకు బంపరాఫర్.. ఒక్కొక్కరికీ రూ.3.25 కోట్ల బోనస్..
ABN , Publish Date - May 27 , 2026 | 01:40 PM
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది.
దక్షిణ కొరియా టెక్ దిగ్గజం సామ్‌సంగ్ తన ఉద్యోగులకు భారీ బోనస్‌లు ప్రకటించి ప్రపంచం మొత్తాన్ని నివ్వెరపరిచింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా సెమీకండక్టర్ వ్యాపారంలో వచ్చిన భారీ లాభాలను ఉద్యోగులతో పంచుకోవాలని నిర్ణయించుకుంది. గత త్రైమాసికంలో సామ్‌సంగ్ ఆదాయం 49 రెట్లు పెరిగింది. ఈ నేపథ్యంలో చిప్ విభాగానికి చెందిన ఒక్కొక్క ఉద్యోగికి దాదాపు 4 లక్షల డాలర్లు (సుమారు రూ. 3.3 కోట్లు) అందించనుంది (Samsung AI profits).
కంపెనీకి వచ్చిన లాభాలతో పాటు ఇటీవల సంస్థ చిప్ విభాగం ఉద్యోగులు చేపట్టిన సమ్మె కూడా ఈ బోనస్‌కు ప్రధాన కారణమని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఏఐ రంగంలో విపరీతమైన డిమాండ్ కారణంగా చిప్ విభాగం సామ్‌సంగ్‌కు భారీ ఆదాయాన్ని తెస్తోంది. ముఖ్యంగా ఏఐ సర్వర్లు, డేటా సెంటర్లు, హై బ్యాండ్‌విడ్త్ మెమొరీ (HBM) చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో కంపెనీ భారీ లాభాలు ఆర్జించింది (Samsung workers bonus).
లాభాల్లో వాటా కోరుతూ ఉద్యోగులు కూడా సమ్మె హెచ్చరికలు జారీ చేశారు (Samsung semiconductor bonus). దీంతో సంస్థ యాజమాన్యం దిగి వచ్చింది. దాదాపు 78 వేల మంది ఉద్యోగులకు కంపెనీ ఆపరేటింగ్ లాభాల్లో 10.5 శాతం వాటాను బోనస్ రూపంలో ఇవ్వాలని నిర్ణయించింది. అదనంగా ఇప్పటికే అమల్లో ఉన్న 1.5 శాతం ప్రోత్సాహక పథకం కూడా కొనసాగనుంది. కాగా, సెమీకండక్టర్ విభాగానికి భారీ బోనస్‌లు లభిస్తుండగా, మొబైల్, గృహోపకరణ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు చాలా తక్కువ బోనస్‌లు రావచ్చని సమాచారం.
ఇవి కూడా చదవండి..
స్థిరంగా బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు.. 31 మంది మృతి..