సామ్‌సంగ్ ఎస్26 సిరీస్ మరింత ప్రియం
ABN , Publish Date - Sep 29 , 2026 | 05:11 AM
పండగ సీజన్‌కు ముందు ఎలక్ర్టానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ వినియోగదారులకు షాక్ ఇచ్చిం ది. తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ ధరను...
17 శాతం వరకు ధర పెంపు
న్యూఢిల్లీ: పండగ సీజన్‌కు ముందు ఎలక్ర్టానిక్స్ దిగ్గజం సామ్‌సంగ్ వినియోగదారులకు షాక్ ఇచ్చిం ది. తన ఫ్లాగ్‌షిప్ గెలాక్సీ ఎస్26 సిరీస్ ధరను 17 శాతం వరకు పెంచినట్టు పరిశ్రమవర్గాలు తెలిపాయి. ఈ ఏడాది జనవరిలో గెలాక్సీ ఎస్26 మోడ ళ్లు విడుదలయ్యాయి. గెలాక్సీ ఎస్25 సిరీ్‌సకన్నా 8-15 శాతం అధిక ఽధరతో మార్కెట్లోకి వచ్చాయి. ఎస్26 సిరీ్‌సలో 256జీబీ స్టోరేజ్‌తో కూడిన బేసిక్ మోడల్ ప్రారంభ ధర రూ.87,999తో పోల్చితే దాదాపు 17 శాతం పెరిగి రూ.1,02,999కు చేరుకుంది. 1టీబీ స్టోరేజ్‌తో కూడిన టాప్ మోడల్ ఎస్26 అల్ర్టా ఇప్పుడు రూ.2,14,999కు అందుబాటులో ఉండనుంది. 512 జీబీ స్టోరేజ్‌తో కూడిన ఎస్26 ధర 13.9 శాతం పెరిగి రూ.1,22,999కు, 256 జీబీతో ఉన్న ఎస్26+ ధర 12.5 శాతం మేర పెరిగి రూ.1,34,999కు చేరింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఆసియా క్రీడల్లో ఈషా సింగ్‌కు వెండి పతకం.. సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్లుగా గెజిట్ నోటిఫికేషన్..