సాయి పేరెంటరల్స్ నికర లాభం రూ.11 కోట్లు
ABN , Publish Date - Nov 02 , 2026 | 05:09 AM
ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఫార్మా కంపెనీ సాయి పేరెంటరల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. ఈ కాలానికి కంపెనీ రూ.196 కోట్ల ఆదాయంపై రూ.11 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ ఆర్థిక సంవత్సరం (2026-27) తొలి త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం 9 శాతం, నికర లాభం 32.7 శాతం పెరిగాయి. సెప్టెంబరు ముగిసిన ఆరు నెలలకు రూ.376 కోట్ల ఆదాయంపై రూ.18 కోట్ల నికర లాభం నమోదు చేసింది. జూన్‌తో ముగిసిన క్యూ1తో పోలిస్తే ఆదాయం 50 శాతం పెరిగినట్టు కంపెనీ తెలిపింది.
ఈ వార్తలనూ చదవండి:
జీఎస్టీ వసూళ్లలో భారీ పెరుగుదల.. అక్టోబర్‌లో రూ.2.31 లక్షల కోట్లు..
స్థిరంగా కొనసాగుతున్న వెండి ధర..