Share News

ఈ ఏడాదే హైదరాబాద్‌ ఎంఆర్‌ఓ అందుబాటులోకి

ABN , Publish Date - Feb 10 , 2026 | 05:43 AM

విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) కోసం సాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ పనులు ఊపందుకున్నాయి. ఈ యూనిట్‌ కోసం ఇప్పటికే 60 మందికిపైగా...

ఈ ఏడాదే హైదరాబాద్‌ ఎంఆర్‌ఓ అందుబాటులోకి

60కి పైగా టెక్నీషియన్ల నియామకం : సాఫ్రాన్‌

ముంబై: విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్‌హాలింగ్‌ (ఎంఆర్‌ఓ) కోసం సాఫ్రాన్‌ సంస్థ హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్న యూనిట్‌ పనులు ఊపందుకున్నాయి. ఈ యూనిట్‌ కోసం ఇప్పటికే 60 మందికిపైగా టెక్నీషియన్లను నియమించినట్టు సాఫ్రాన్‌ వెల్లడించింది. గత ఏడాది నవంబరులో ప్రారంభించిన సాఫ్రాన్‌ ఎంఆర్‌ ఓ కేంద్రం ఈ ఏడాది వాణిజ్యపరంగా అందుబాటులోకి రానుందని తెలిపింది. ఏటా 300 లీప్‌ ఇంజన్లకు ఎంఆర్‌ఓ సేవలు అందించేలా సాఫ్రాన్‌ ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్‌ తొలి దశలో 250 మంది, పూర్తి స్థాయి సామర్ధ్యం అందుకునే సరికి 1,100 మంది పని చేస్తారు. ఫ్రాన్స్‌ కేంద్రంగా పని చేసే విమాన ఇంజన్ల తయారీ సంస్థ సాఫ్రాన్‌, అమెరికా కేంద్రంగా పనిచేసే మరో విమాన ఇంజన్ల తయారీ కంపెనీ జీఈ ఏరోస్పేస్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీఎ్‌ఫఎం ఇంటర్నేషనల్‌ హైదరాబాద్‌లో ఈ ఎంఆర్‌ఓ యూనిట్‌ ఏర్పాటు చేస్తోం ది. ఈ యూనిట్‌లో ఎయిర్‌బస్‌ 320 నియో, బోయింగ్‌ 737 మ్యాక్స్‌ విమానాల్లో ఉపయోగించే లీప్‌ ఇంజన్లకు ఎంఆర్‌ఓ సేవలు అందిస్తారు.

ఇవి కూడా చదవండి..

ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి.. భారత్ నిధులందిస్తోందంటూ పాక్ మంత్రి ఆరోపణలు..

బంగారం, వెండి స్వల్పంగా తగ్గాయ్.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Feb 10 , 2026 | 05:43 AM