హైదరాబాద్‌లో జీవ శాస్త్రాల క్యాంపస్
ABN , Publish Date - Feb 18 , 2026 | 02:11 AM
హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో మరో లైఫ్ సైన్సెస్ క్యాంపస్ రానుంది. లైఫ్ సైన్సెస్ కంపెనీల పరిశోధనలకు అవసరమైన సమగ్ర మౌలిక సదుపాయాలు ఈ క్యాంప్‌సలో లభిస్తాయి. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ జనరల్ అట్లాంటిక్...
రూ.900 కోట్లతో జినోమ్ వ్యాలీలో ఏర్పాటు
ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ వెల్లడి
హైదరాబాద్ జినోమ్ వ్యాలీలో మరో లైఫ్ సైన్సెస్ క్యాంపస్ రానుంది. లైఫ్ సైన్సెస్ కంపెనీల పరిశోధనలకు అవసరమైన సమగ్ర మౌలిక సదుపాయాలు ఈ క్యాంప్‌సలో లభిస్తాయి. అంతర్జాతీయ పెట్టుబడుల సంస్థ జనరల్ అట్లాంటిక్ అనుబంధ సంస్థ యాక్టిస్ నిర్వహణలోని ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ ఈ క్యాంప్‌సను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం వచ్చే ఆరేళ్లలో 10 కోట్ల డాలర్లు (సుమారు రూ.900 కోట్లు) ఖర్చు చేయనున్నట్లు ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ సీఈఓ, ఎండీ ఆశిష్ సింగ్ వెల్లడించారు. మొత్తం 12 ఎకరాల్లో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. లైఫ్ సైన్సెస్ కంపెనీల పరిశోధనలు, ఔషధాల అభివృద్ధికి అవసరమైన సమగ్ర లేబొరేటరీ్‌సను ఈ క్యాంప్‌సలో ఏర్పాటు చేస్తారు. కాగా జినోమ్ వ్యాలీలో ఆర్‌ఎక్స్ ప్రొపెల్లెంట్ ఇప్పటికే 1జీవీ, 3జీవీ పేరుతో రెండు క్యాంప్‌సలను నిర్వహిస్తోంది.
ఇవి కూడా చదవండి..
బిల్‌గేట్స్ AI సమ్మిట్ ప్రసంగం: ఉత్కంఠకు తెర.. స్పష్టతనిచ్చిన ఫౌండేషన్!
సర్వజన క్షేమానికి పరిష్కారాలు కనుగొందాం