Share News

రెండు నెలలకు పైగా కనిష్ఠానికి రూపాయి

ABN , Publish Date - Oct 02 , 2026 | 05:40 AM

భారత కరెన్సీ భారీగా క్షీణించింది. డాలర్‌తో రూపీ మారకం విలువ ఏకంగా 31 పైసలు నష్టపోయి రూ.96.25 వద్ద ముగిసింది. రూపాయికిది..

రెండు నెలలకు పైగా కనిష్ఠానికి రూపాయి

రూ.96 దాటిన డాలర్‌-రూపీ మారకం రేటు

భారత కరెన్సీ భారీగా క్షీణించింది. డాలర్‌తో రూపీ మారకం విలువ ఏకంగా 31 పైసలు నష్టపోయి రూ.96.25 వద్ద ముగిసింది. రూపాయికిది రెండు నెలలకు పైగా కనిష్ఠ స్థాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మన ఈక్విటీ మార్కెట్‌ నుంచి పెద్దఎత్తున పెట్టుబడులను అధిక వడ్డీ పంచుతున్న యూఎస్‌ బాండ్లలోకి మళ్లిస్తుండటం రూపాయి క్షీణతకు ప్రధాన కారణం. డాలర్‌ బలోపేతం, ముడి చమురు ధరల పెరగుదల కూడా మన కరెన్సీపై ఒత్తిడి పెంచాయి.

ఇవీ చదవండి:

స్కూల్‌ టైమ్‌లోనే గాఢంగా నిద్రపోయిన ప్రిన్సిపాల్.. వీడియో వైరల్

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు.!

Updated Date - Oct 02 , 2026 | 05:40 AM