హైదరాబాద్‌లో రోష్ డిజిటల్ టెక్నాలజీ హబ్
ABN , Publish Date - Jul 02 , 2026 | 05:50 AM
మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో కొలువు తీరనుంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే దిగ్గజ ఫార్మా కంపెనీ ‘రోష్’ హైదరాబాద్‌లో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): మరో అంతర్జాతీయ సంస్థ హైదరాబాద్‌లో కొలువు తీరనుంది. స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేసే దిగ్గజ ఫార్మా కంపెనీ ‘రోష్’ హైదరాబాద్‌లో తన డిజిటల్ టెక్నాలజీ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే ఏడాది తొలి త్రైమాసికానికల్లా ఈ హబ్ ఏర్పాటు పూర్తి కానుంది. పుణె తర్వాత రోష్ కంపెనీకి భారత్‌లో ఇది రెండో డిజిటల్ టెక్నాలజీ హబ్. హైదరాబాద్ హబ్ ద్వారా కంపెనీ బయోస్టాటిస్టిక్స్, ఈఆర్‌పీ, మెడికల్ సేఫ్టీకి సంబంఽధించిన ఐటీ సేవలు, డిజిటల్ అప్లికేషన్స్ అందించనుంది.
హైదరాబాద్‌లో లైవ్‌ర్యాంప్ కార్యాలయం: అమెరికా కేంద్రంగా పనిచేసే ‘లైవ్‌ర్యాంప్’ కంపెనీ హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. డేటా కొలాబరేషన్‌లో అంతర్జాతీయంగా ఈ కంపెనీకి మంచి పేరుంది. హైదరాబాద్ కేంద్రం కోసం కంపెనీ ఇప్పటికే 250 మంది ఉద్యోగుల నియామకాలు పూర్తి చేసింది. వచ్చే 12 నెలల్లో మరో వంద మంది నియామకాలు పూర్తి చేస్తామని తెలిపింది.
ఇవి కూడా చదవండి...
దేశంలోనే అత్యధిక పెన్షన్ల పంపిణీలో ఏపీ రికార్డ్: ఎంపీ కేశినేని శివనాథ్
కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల
Read Latest AP News And Telangana News And National News