మార్కెట్లోకి మళ్లీ రెనో డస్టర్
ABN , Publish Date - Jan 27 , 2026 | 05:47 AM
రెనో ఇండియా మార్కెట్లోకి మళ్లీ తన పాపులర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ డస్టర్‌ను తీసుకువచ్చింది. 2022లో డస్టర్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్ నుంచి...
చెన్నై: రెనో ఇండియా మార్కెట్లోకి మళ్లీ తన పాపులర్ మిడ్‌సైజ్ ఎస్‌యూవీ డస్టర్‌ను తీసుకువచ్చింది. 2022లో డస్టర్ ఎస్‌యూవీని కంపెనీ మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా ‘రెనో.రీథింక్’ వ్యూహంలో భాగంగా కంపెనీ సోమవారం చెన్నైలో సరికొత్త తరం డస్టర్‌ను ఆవిష్కరించింది. డస్టర్ ఎస్‌యూవీని హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌తో రెండు కొత్త టర్బో ఇంజన్స్‌తో తీసుకువచ్చింది. ఈ ఏడాది మార్చిలో డస్టర్ ధరలను ప్రకటించనున్నట్లు రెనో తెలిపింది. కాగా ఏప్రిల్ ద్వితీయార్ధం నుంచి టర్బో వేరియంట్ డస్టర్, దీపావళి నుంచి హైబ్రిడ్ వేరియంట్స్ డెలివరీలను ప్రారంభించనుంది.
ఇవీ చదవండి:
గోల్డ్, సిల్వర్ రేట్స్! ఈ వారం కూడా దూకుడు తప్పదా..
రూపాయి పతనంపై దిగుమతిదారుల బెంబేలు