Share News

రిలయన్స్‌ రిటైల్‌ వాల్యుయేషన్‌ భళా

ABN , Publish Date - Apr 10 , 2026 | 02:22 AM

ముకేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నాయకత్వంలోని ‘రిలయన్స్‌ రిటైల్‌’ మరో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం...

రిలయన్స్‌ రిటైల్‌ వాల్యుయేషన్‌ భళా

  • జనవరి నాటికి రూ.9.26 లక్షల కోట్లు

  • హెక్టాకార్న్స్‌ జాబితాలో ఏడో స్థానం

  • స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేషన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌

న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీ కుమార్తె ఇషా అంబానీ నాయకత్వంలోని ‘రిలయన్స్‌ రిటైల్‌’ మరో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరి నాటికి అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ విలువ (వాల్యుయేషన్‌) 10,000 కోట్ల డాలర్లు (సుమారు రూ.9.26 లక్షల కోట్లు) దాటింది. దీంతో స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఈ కంపెనీని విలువపరంగా ప్రపంచంలోని ఏడో అతి పెద్ద ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీగా ప్రకటించింది. ఏదైనా ప్రైవేటు స్టార్టప్‌ కంపెనీ మార్కెట్‌ విలువ 10,000 కోట్ల డాలర్లు దాటితే దాన్ని హెక్టాకార్న్‌ లేదా సూపర్‌ స్టార్టప్‌ అంటారు. మన దేశం నుంచి రిలయన్స్‌ రిటైల్‌ ఒక్కటే ఈ జాబితాలో చోటు సంపాదించింది. ప్రపంచంలో మరే ప్రైవేటు రిటైల్‌ స్టార్టప్‌ కూడా ఈ స్థాయిలో లేదని ఎస్‌జీసీబీ తెలిపింది.

అగ్రస్థానంలో ‘ఓపెన్‌ ఏఐ’: ఈ తాజా జాబితాలో ఓపెన్‌ ఏఐ, ఆంథ్రోపిక్‌, ఇలాన్‌ మస్క్‌ నిర్వహణలోని స్పేస్‌ ఎక్స్‌ కంపెనీలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో నిలిచాయి. స్టాన్‌ఫోర్డ్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ 100 ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీలతో రూపొందించిన జాబితాలో ఈ మూడు కంపెనీల వాల్యుయేషనే మూడో వంతు వరకు ఉంది. ఇక మన దేశానికి చెందిన ఎన్‌ఎ్‌సఈ (2,400 కోట్ల డాలర్లు), టాటా ఈవీ మొబిలిటీ (900 కోట్ల డాలర్లు) 27, 93వ స్థానాల్లో నిలిచాయి.

ఇవి కూడా చదవండి

ఇరాన్‌తో కాల్పుల విరమణ ఒప్పందం.. నెతన్యాహుపై స్వదేశంలో విమర్శలు..

ఏబీఎన్‌ సిబ్బందికి బెదిరింపులు.. కాకాణిపై కేసు నమోదు

Updated Date - Apr 10 , 2026 | 02:22 AM