పోటీకి భయపడేది లేదు.. మస్క్‌కు రిలయన్స్ కౌంటర్
ABN , Publish Date - Oct 16 , 2026 | 11:50 AM
భారత మార్కెట్లో స్టార్‌లింక్ సంస్థ ప్రవేశించకుండా కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారంటూ టెస్లా చేసిన వ్యాఖ్యలకు రిలయన్స్ గట్టిగా బదులిచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మార్కెట్లో స్టార్‌లింక్ సంస్థ ప్రవేశించకుండా కొందరు బడా వ్యాపారవేత్తలు అడ్డుకుంటున్నారంటూ టెస్లా చేసిన వ్యాఖ్యలకు రిలయన్స్ గట్టిగా బదులిచ్చింది. పోటీకి తామెప్పుడూ రేడీ అని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రధాని ముఖేశ్ అంబానీ అంటూ నేరుగా మస్క్ పోస్టు పెట్టిన నేపథ్యంలో రిలయన్స్ ఘాటు కౌంటర్ ఇచ్చింది.
భారత మార్కెట్, తమ సంస్థలపై ఇటీవల వినిపించిన కొన్ని కామెంట్స్ నేపథ్యంలో వాస్తవాలను తెలియజేస్తున్నామని రిలయన్స్ తన ప్రకటనలో పేర్కొంది. ప్రజల జీవితాలను మెరుగుపరిచే విదేశీ సంస్థలు, టెక్నాలజీలను భారత్ ఎల్లప్పుడూ స్వాగతిస్తుందని స్పష్టం చేసింది. అలాంటి దేశంలో తమ సంస్థ అభివృద్ధి చెందిందని వివరించింది. అయితే, గతంలో భారత ప్రభుత్వం పేర్కొన్నట్టు విదేశీ సంస్థలైనా స్వదేశీ సంస్థలైనా చట్టాలకు కట్టుబడి ఉండాలని పేర్కొంది. తాము కూడా శాటిలైట్ ఇంటర్నెట్ సేవల అనుమతుల కోసం వేచి చూస్తున్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పింది.
తాము మార్కెట్లో పోటీకి ఏనాడూ భయపడలేదని రిలయన్స్ స్పష్టం చేసింది. టెలికం రంగంలో అత్యంత పోటీ ఉన్న సమయంలో తాము మార్కెట్లో ప్రవేశించిన విషయాన్ని గుర్తు చేసింది. 10 ఏళ్లల్లో 53 కోట్ల మంది కస్టమర్ల విశ్వాసాన్ని చూరగొన్నామని సంస్థ తెలిపింది. అత్యంత చౌకైన ధరల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్నామని చెప్పింది. భారత శాటిలైట్ ఇంటర్నెట్ సేవల రంగంలో స్టార్‌లింక్‌తో పాటు ఏ సంస్థనైనా తాము స్వాగతిస్తామని చెప్పింది.
ఈ వార్తలనూ చదవండి:
ప్రస్తుతానికి స్థిరంగా పసిడి ధరలు.. మార్కెట్లో నేడు రేట్స్ ఎలా ఉన్నాయంటే..
సేవల విస్తరణపైనే దృష్టి: జియో ఎండీ ఆకాశ్ అంబానీ