Share News

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూపీ బాండ్ల జారీ!

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:17 AM

భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వచ్చే వారంలో రూపీ బాండ్ల జారీ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమీకరించే ఆలోచనలో...

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూపీ బాండ్ల జారీ!

  • రూ.12,500 కోట్ల వరకు సమీకరించనున్న సంస్థ

  • 2023 నవంబరు తర్వాత ఇదే మొదటిసారి

న్యూఢిల్లీ: భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) వచ్చే వారంలో రూపీ బాండ్ల జారీ ద్వారా రూ.12,500 కోట్ల వరకు సమీకరించే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ట్రిపుల్‌ ఏ రేటింగ్‌తో కూడిన ఐదేళ్ల కాలపరిమితి బాండ్లపై రిలయన్స్‌ 7.47 శాతం వార్షిక వడ్డీ ఆఫర్‌ చేయబోతున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దేశీయ కరెన్సీ బాండ్ల జారీ ద్వారా రిలయన్స్‌ నిధులు సమీకరించనుండటం దాదాపు మూడేళ్ల తర్వాత ఇదే మొదటిసారి. అంతేకాదు, ఈ ఏడాది దేశీయ మార్కెట్లో అతిపెద్ద లిస్టెడ్‌ బాండ్ల జారీ కానుంది. 2023 నవంబరులో ఆర్‌ఐఎల్‌ రూపీ బాండ్ల జారీ ద్వారా రూ.20,000 కోట్లు సమీకరించింది. ఈ నెల 18న ఈ బాండ్ల ఇష్యూ ప్రారంభం కానుందని సమాచారం. అంతేకాదు, ఆర్‌ఐఎల్‌ 10 ఏళ్ల కాలపరిమితి బాండ్ల జారీ ఆలోచనలో కూడా ఉందని ఆ వర్గాలు వెల్లడించాయి.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:17 AM